
బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు సుజనాచౌదరికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. సుజనా చౌదరికి సంబంధించిన మెడికల్ కాలేజీ గుర్తింపు రద్దు అయ్యింది. దీంతో ఈ విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు చేసుకునేందుకు వీల్లేకుండా పోయింది.
తెలంగాణలోని ఘనపూర్‌లో సుజనాచౌదరికి మెడిసిటీ పేరుతో వైద్య కళాశాల వుంది. ఇది కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ పరిధిలో ఉంది. మెడికల్ కాలేజీ గుర్తింపును రద్దు చేస్తూ నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) ఉత్తర్వులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీలో టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా సుజనాచౌదరి చేరిన సంగతి తెలిసిందే.
అప్పట్లో సుజనాతో పాటు మరో ముగ్గురు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు. అయితే వీళ్లందరినీ చంద్రబాబే బీజేపీలోకి పంపారనే ప్రచారం లేకపోలేదు. ముఖ్యంగా సుజనాచౌదరిపై సీబీఐ, ఈడీ కేసులున్నాయి. బీజేపీలో చేరిన తర్వాత ఆయనపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరపడం లేదని ప్రతిపక్షాల నేతలు విమర్శిస్తున్నారు. బీజేపీలో కీలక నాయకుడైన సుజనాచౌదరి మెడికల్ కాలేజీ గుర్తింపు రద్దు చేయడం సీరియస్ అంశమే.
సుజనాచౌదరి దేశంలో నలుగురైదుగురు లాబీయిస్టుల్లో ఒకరు. కార్యసాధకుడిగా ఆయనకు పేరు వుంది. అలాంటిది తన సొంత మెడికల్ కాలేజీకి ఇబ్బందులు ఎదురయ్యాయంటే ఆయనకు బీజేపీలో పట్టు సన్నగిల్లిందా? అనే చర్చకు తెరలేచింది. అయితే ఇబ్బందులు తాత్కాలికమే అని సుజనాచౌదరి అనుచరులు చెబుతున్నారు.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా