రండి బాబు రండి…అమ్మ‌కానికి వేళైంది!

తెలంగాణ‌లో ప్ర‌భుత్వ భూముల అమ్మ‌కానికి వేళైంది. నిరుప‌యోగ, అలాగే ఆక్ర‌మ‌ణ‌కు గురి అవుతున్నాయ‌న్న సాకుతో ప్ర‌భుత్వం భూముల అమ్మ‌కానికి దిగింది. ప్ర‌భుత్వ భూముల అమ్మ‌కం ఒక్క తెలంగాణ‌కే ప‌రిమితం కాలేదు.  Advertisement ఆంధ్రాలో భూముల…

తెలంగాణ‌లో ప్ర‌భుత్వ భూముల అమ్మ‌కానికి వేళైంది. నిరుప‌యోగ, అలాగే ఆక్ర‌మ‌ణ‌కు గురి అవుతున్నాయ‌న్న సాకుతో ప్ర‌భుత్వం భూముల అమ్మ‌కానికి దిగింది. ప్ర‌భుత్వ భూముల అమ్మ‌కం ఒక్క తెలంగాణ‌కే ప‌రిమితం కాలేదు. 

ఆంధ్రాలో భూముల అమ్మ‌కంపై హైకోర్టులో విచార‌ణ జ‌రుగుతోంది. అలాగే దేశ వ్యాప్తంగా వివిధ కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌ల భూముల విక్ర‌యం, లీజు అంశాలు ఏ విధంగా చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయో అంద‌రికీ తెలిసిందే. ఇక తెలంగాణ విష‌యానికి వ‌స్తే ఇప్ప‌టికే మొద‌టి విడ‌త‌లో భాగంగా ఖానామెట్‌లో ఎక‌రం భూమి రూ.55 కోట్ల‌కు అమ్ముడుపోయిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో రెండో విడ‌త అమ్మ‌కానికి తెలంగాణ స‌ర్కార్ ముంద‌డుగు వేసింది. ఇందులో భాగంగా ఖానామెట్‌లో 22.79 ఎకరాలు, పుప్పాలగూడలో 94.56 ఎకరాలు, ఖానామెట్‌లో 9 ప్లాట్లు, పుప్పాలగూడలో 26 పాట్లు విక్రయించడానికి సిద్ధం చేసింది. మొత్తం 117.35 ఎకరాల అమ్మ‌కానికి సోమవారం టీఎస్ఐఐసీ నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. ఇందులో భాగంగా సెప్టెంబర్‌ 27న ఖానామెట్‌, అదే నెల 29న పుప్పాలగూడ భూముల ఈ-వేలం నిర్వహించనున్నారు.  

హైద‌రాబాద్‌లో ప్ర‌భుత్వ భూముల కొనుగోలుకు డిమాండ్ బాగుంది. తొలి విడ‌త‌లో ఖానామెట్ భూములు హాట్‌కేకులా అమ్ముడు పోయిన సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లో విక్ర‌యించ‌నున్న 117.35 ఎక‌రాలు కూడా అదే రీతిలో అమ్ముడుపోతాయ‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. త‌ద్వారా ప్ర‌భుత్వానికి ఆదాయం స‌మ‌కూర‌నుంది. ఇదిలా వుండ‌గా ప్ర‌భుత్వ భూముల విక్ర‌యంపై న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించ‌క‌పోతే అంతా స‌వ్యంగా సాగిపోతుంది.