తమ్మయ్యలకు పౌరుషం తన్నుకొచ్చింది….!

కేంద్రంలోని మోడీ సర్కార్ ఏపీకి ఏమీ విదల్చలేదని తమ్మయ్యలు తెగ బాధపడిపోతున్నారు. మేమే అధికారంలో  ఉంటేనా అంటూ దీర్ఘాలు, రాగాలూ తీస్తున్నారు. ఏపీలో సమర్ధుడైన నాయకులు లేకపోవడం వల్లనే ఈ దుస్థితి అంటూ కన్నీరు…

కేంద్రంలోని మోడీ సర్కార్ ఏపీకి ఏమీ విదల్చలేదని తమ్మయ్యలు తెగ బాధపడిపోతున్నారు. మేమే అధికారంలో  ఉంటేనా అంటూ దీర్ఘాలు, రాగాలూ తీస్తున్నారు. ఏపీలో సమర్ధుడైన నాయకులు లేకపోవడం వల్లనే ఈ దుస్థితి అంటూ కన్నీరు కారుస్తున్నారు.

జగన్ తుగ్లక్ చర్యల వల్లనే ఏపీకి డబ్బులు రాలేదని ఉత్తరాంధ్ర నేతలు కళా వెంకటరావు, అచ్చెన్నాయుడు. వాసుపల్లి గణేష్ కుమార్  ముక్తకంఠంతో ఘోషిస్తున్నారు. ఇది నిజమే అనుకుంటే గత మూడేళ్ళుగా వెనకబడిన ఉత్తరాంధ్రాలోని మూడు జిల్లాలకు 450 కోట్లు నిధులు ఆపేశారు. దానికి తెలుగు  తమ్ముళ్ళ అసమర్ధత కాదా అన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న.

ఉత్తాంధ్రాకు ప్రత్యేక ప్యాకేజిలను తీసుకువస్తామని 2014 ఎన్నికల్లో ఊరూరా చెప్పుకుని తిరిగిన టీడీపీ పెద్దలు అయిదేళ్ళూ ఆ వూసే మరచిపోయారు.  ఇక  ఉత్తరాంధ్రాకు గిరిజన విశ్వవిద్యాలయం విభజన చట్టంలో పెట్టినా అయిదేళ్ళలో దాని సాధించలేకపోయారు. పెట్రోలియం వర్శిటీకీ అతీ గతీ లేకుండా పాయే.

విశాఖ మెట్రో రైలు ప్రతిపాదనలు కాంగ్రెస్ హాయంలో కదిలితే అయిదేళ్ళ టీడీపీ పాలనలో మూలకు చేరాయి. కొత్తగా ప్రాజెక్టులు స్మార్ట్ సిటీ విశాఖకు లేవు. మూడు జిల్లాల అభివ్రుధ్ధికి కేంద్రం నాడు విదిలించింది లేదు.

ఒక్క కేంద్ర ప్రాజెక్ట్ అయినా మా జిల్లాలో పెట్టారా అని అత్యంత వెనకబడిన  శ్రీకాకుళం జిల్లా వాసులు నిగ్గదీసి అడిగినా తమ్ముళ్ళ వద్ద సమాధానం లేదు. ఇపుడు తగుదునమ్మా అని విమర్శలు చేస్తున్నారని వైసీపీ నేతలు కౌంటర్లు వేస్తున్నారు.

మొత్తం మీద చూసుకుంటే అత్త మీద కోపం దుత్త మీద అన్నట్లుగా నాడు  కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే సత్తా లేని తమ్ముళ్ళు ఇపుడు  తమ మీద పడి ఏడవడం దేనికి అని వైసీపీ నేతలు గట్టిగానే రిటార్ట్ ఇస్తున్నారు. ఏది ఏమైనా  అధికారంలో ఇపుడు లేరు కాబట్టి లేస్తే మనిషిని కాను అన్నట్లుగా తమ్ముళ్ళ ప్రతాపంతో మాటలు కోటలు దాటేస్తున్నాయి.

ఈ రికార్డులు ఎవ‌రైనా బ్రేక్ చేస్తే చూడాల‌ని వుంది