ఆటిట్యూడ్ ఈజ్ ఎవ్రిథింగ్ అంటారు! నీ మెదడే నీ జీవితాన్ని నిర్దేశిస్తుందని జెన్ సూక్తి. వీటన్నింటి సారాంశం.. ఏదైనా విషయాన్ని మనం మన ఆలోచనలతో ఎలా డీల్ చేస్తామనేదే ఫలితాన్ని నిర్దేశిస్తుంది. ఈ అంశం గురించి మానసిక పరిశోధకులు తమ పరిశీలనలతో కొన్ని విషయాలను సూక్తికరిస్తున్నారు.
మానసికంగా ప్రధానంగా ఐదు అలవాట్లకు దూరంగా ఉండాలని అంటున్నారు. ఆ ఐదు అలవాట్లనూ కలిగి ఉంటే.. మీరు అవతలి వారికి అంత ఆమోదనీయమైన వ్యక్తి కాదు! అదే ఈ అలవాట్లు మీకు లేకపోతే.. ఆల్ ఈజ్ వెల్. ఇంతకీ ఆ ఐదు అలవాట్లు ఏవంటే.. వాటి కథేమిటంటే!
క్షమించే క్వాలిటీ లేకపోవడం!
ఒక సినిమాలో హీరో అంటాడు.. క్షమాపణ అనేది తనకు నచ్చని మాట అని. అదేదో సినిమాటిక్ గా అనుకోవాలంతే. అయితే అవతలి వారిని క్షమించగలగడం అనేది చాలా గొప్పగుణం. చిన్న చిన్న విషయాలకే చాలా దూరం పెరుగుతుంది. ఏదైనా విషయంలో ఎవరైనా మనల్ని హర్ట్ చేస్తే.. వారు క్షమార్హులు కాదన్నట్టుగా ట్రీట్ చేస్తాం.
ఈ విషయంలో ఒక్కోరిని చిన్న చిన్న విషయాలకే దూరం పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే వ్యవహారం చిన్నదైనా, పెద్దదైనా.. మేం స్పేర్ చేయడం, ఎవరినీ క్షమించం.. అన్నట్టుగా వ్యవహరించడం, కనీసం మనసులో అయినా.. ఆ కక్షను అలాగే ఉంచుకోవడం.. ఏ మాత్రం గొప్ప వ్యక్తిత్వం కాదు!
ఓవర్ థింకింగ్!
ఇది మనం చేసే పొరపాట్ల విషయంలో. పొరపాట్లు, చిన్న చిన్న తప్పులూ ఎవరైనా చేస్తారు. అయితే ఈ అంశాల గురించి రియలైజేషన్ మంచిదే కానీ, ఇవే విషయాల గురించి ఓవర్ థింకింగ్ చేస్తూ.. పరిపరి విధాలుగా అదే అంశాన్ని పట్టిపట్టి చూస్తూ.. అతిగా ఆలోచించడం మాత్రం అనర్థదాయకమే.
అలాగే ఏదో జరిగి పోవాలి.. అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరిపోవాలనుకోవడం, ఓవర్ ఎగ్జైట్ కావడం.. కూడా అతిగా ఆలోచించడం కిందకే వస్తుంది. ఇలా అతిగా లెక్కలేయడం వల్ల.. అనుకున్నది జరగకపోతే నిస్పృహకు గురయ్యే అవకాశలుంటాయి. కాబట్టి.. జరిగిన దాని గురించి, లేదా జరగాల్సిన దాని గురించి ఓవర్ థింకింగ్ వ్యర్థమైనదే.
నిరాశవాదం!
ఈ తత్వం సబబు అయినది కాదు. ఏ విషయంలో అయినా.. నిరాశ వాదం పనికి వచ్చేది కాదు. అలాగని దురాశ పడాలని కాదు. నిరాశ వల్ల ఒనగూరే ప్రయోజనం మాత్రం శూన్యం. నిరాశవాదం వల్ల నెగిటివ్ థింకింగ్ ఎక్కువవుతుంది. దీని వల్ల ప్రయోజనాలు ఏమీ లేకపోవడమే కాదు.. మానసిక, శారీరక ఆరోగ్యానికి కూడా ఇవి చేటును తీసుకురావొచ్చు.
అవతలివారి నుంచి ఎక్స్ పెక్ట్ చేయడం!
స్నేహితులు, బంధువులు, లేదా ఇంట్లో వాళ్లు.. ఎవ్వరి నుంచి అయినా.. ఎవరి స్థాయికి వాళ్లను లెక్కేసుకుని.. వారి నుంచి అన్నీ ఎక్స్ పెక్ట్ చేసేయడం కూడా సరికాదు. మనం వారి నుంచి ఏవో ఎక్స్ పెక్టేషన్లతో ఉన్నామనే భావన అవతలి వారిలో మిమ్మల్ని చులకన చేయవచ్చు. సపోజ్ మీరే ఏదో ఇస్తారనే భావనతో రిలేషన్షిస్ మెయింటెయిన్ చేస్తున్నారంటే..మీరు సహించగలరా? అదెవరైనా కావొచ్చు.. మనం కోసం ఫలానాది చేయాలి అని కచ్చితంగా అనుకోవడం మంచి లక్షణం కాదు.