లాంఛనం పూర్తి చేసిన తోట త్రిమూర్తులు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారనే ఊహాగానాల్లో నిలిచిన మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఆ లాంఛనం పూర్తి చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత తోట త్రిమూర్తులు విషయంలో ఈ ఊహాగానాలు చెలరేగాయి.…

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారనే ఊహాగానాల్లో నిలిచిన మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఆ లాంఛనం పూర్తి చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత తోట త్రిమూర్తులు విషయంలో ఈ ఊహాగానాలు చెలరేగాయి. అయితే ఎన్నికలకు ముందు  కూడా ఈ సందేహాలే వ్యక్తం అయ్యాయి. అయితే అప్పుడు తెలుగుదేశం పార్టీని వీడటం ఖాయమనే సమయంలో తోట త్రిమూర్తులు అక్కడే ఆగిపోయారు. పార్టీ ఓడిపోయాకా కాపు నేతల సమావేశంలో ఈయన పాల్గొన్నారు.

అప్పుడు కూడా టీడీపీని వీడే విషయంపై స్పందించలేదు. కొన్నిరోజుల నుంచి తోట విషయంలో ఊహాగానాలు అధికం అయ్యాయి. ఆదివారంతో ఆయన లాంఛనంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. 

ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. తోట త్రిమూర్తులతో రాజకీయ వైరం ఉందనే మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా ఈ కార్యక్రమంలో పక్కనే ఉన్నారు. బోస్ కు, త్రిమూర్తులకు చాలాకాలంగా పడదని అంటారు. ఈ క్రమంలో బోస్ కు కూడా సమాచారం ఇచ్చి, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి త్రిమూర్తులును చేర్చుకున్నారని సమాచారం. తోట చేరిక సమయంలో సుభాష్ చంద్రబోస్ పక్కనే కనిపించారు.

మారని తీరు.. అదే కుట్రల, కుతంత్రాల రాజకీయం!