కాషాయం కట్టేయ్ గురూ…?

బీజేపీ అంటే తేడా గల పార్టీ అని చెబుతారు. ఈ మాట పదే పదే తొలి అధ్యక్షుడు వాజ్ పేయి కార్యకర్తలకు చెప్పేవారు. మనం భిన్నం, అంటే మన పోకడలు వర్తమాన రాజకీయ నేతలకు…

బీజేపీ అంటే తేడా గల పార్టీ అని చెబుతారు. ఈ మాట పదే పదే తొలి అధ్యక్షుడు వాజ్ పేయి కార్యకర్తలకు చెప్పేవారు. మనం భిన్నం, అంటే మన పోకడలు వర్తమాన రాజకీయ నేతలకు దూరంగా, హుందాగా ఉండాలన్నది వాజ్ పేయి ఇచ్చిన సందేశం. కానీ ఆచరణలో ఆ తేడా కొట్టుకుపోయింది.

బీజేపీ కూడా అన్ని పార్టీల లాంటిదేనని కూడా ఎప్పటికపుడు రుజువు చేసుకుంటూనే ఉంది. ఇదిలా ఉండగా ఇప్పటికే బీజేపీలోకి టీడీపీకి చెందిన ఎంపీలు చేరారు. వారు సొంత వ్యవహారాలు చక్కబెట్టుకోవడానికే చేరారని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. అవినీతి ఆరోపణలు ఉన్న వారు తమకు రక్షణ కోసం బీజేపీని ఆశ్రయిస్తున్నారని కూడా విమర్శలు వచ్చాయి.

ఇక తాజాగా బీజేపీలోకి మైనింగ్ డాన్ లు, కొండలు దొలిచి అవినీతికి పాల్పడిన వారు చేరడమే అసలైన విషాదం. విశాఖ జిల్లాలో టీడీపీ హయాంలో మైనింగ్ డాన్ గా పేరు పొంది అనేక అక్రమాలు చేశారని పేరున్న ఒక పెద్ద మనిషి బీజేపీలో తాజాగా చేరడాన్ని చూసి కార్యకర్తలే షాక్ తింటున్నారు.

సదరు మైనింగ్ డాన్ మీద ఇప్పటికే  వందల కోట్ల  భారీ జరీమానాను  అధికారులు విధించారు. ఆయన‌కు ఇపుడు టీడీపీ అండ లేదు, అనకొండలా మారి కొండలను దొలిచేస్తూ అన్ని రూల్స్ బ్రేక్ చేస్తున్న ఈ మైనింగ్ కింగ్ కి వైసీపీ అధికారంలోకి రావడంతో కష్టాలు మొదలయ్యాయి. దాంతో ఆయన రాత్రికి రాత్రి బీజేపీలోకి జంప్ చేశారు.

మరి ఆయన లీలలు, అవినీతి కధలు అంతా కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తూంటే ఎలా చేర్చుకున్నారో బీజేపీ నేతలే చెప్పాలని అంటున్నారు. మరి బీజేపీలో చేరితే తన మీద కేసులు, జరీమానాలూ ఉండవని మాస్టర్ ప్లాన్ వేశారో ఏమో గానీ మైనింగ్ డాన్ కాషాయం కట్టేశారని అంటున్నారు.

ఏపీలో అధికారంలోకి వస్తాం, అవినీతి మీద పోరాడుతామని చెప్పుకుంటున్న బీజేపీలో ఇలాంటి వారు చేరితే అసలుకే ఎసరు అంటున్నారు. బీజేపీ  షెల్టర్ జోన్ గా మారకుండా చూసుకోవాలని కూడా సొంత పార్టీ నుంచే హెచ్చరికలు వస్తున్నాయిట.

కమ్మ వారికి చంద్రబాబు చేస్తున్న నష్టం ఎంత