పవన్ స్వదేశీ నినాదం ఇలా రివర్స్ అయిందేంటబ్బా!

కొత్తగా స్వదేశీ నినాదం అందుకున్నారు పవన్. ఆయన ఉద్దేశం మంచిదే కానీ పవన్ లాంటి వ్యక్తి ఈ నివాదం చేయడాన్ని సోషల్ మీడియాలో చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. ఓ రేంజ్ లో పవన్ ను…

కొత్తగా స్వదేశీ నినాదం అందుకున్నారు పవన్. ఆయన ఉద్దేశం మంచిదే కానీ పవన్ లాంటి వ్యక్తి ఈ నివాదం చేయడాన్ని సోషల్ మీడియాలో చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. ఓ రేంజ్ లో పవన్ ను ట్రోల్ చేస్తున్నారు. ఈ తిట్లు ఏ రేంజ్ కి వెళ్లాయంటే.. వస్తువులేనా మనుషుల్ని కూడా స్వదేశీ అంటావా అంటూ.. ఆయన వ్యక్తిగత జీవితంలోకి కూడా ప్రవేశించాయి.

అసలేం జరిగిందంటే..మన ఉత్పత్తి, మన ఉపాధి, మన అభివృద్ధి.. అంటూ ఆత్మ నిర్భర భారత్.. నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఓ వీడియో విడుదల చేశారు పవన్ కల్యాణ్. వినాయక చవితి పర్వదినం శుభ సందర్భాన.. స్వదేశీ వస్తువుల్నే కొనేలా ప్రజల్ని చైతన్య పరచడం పవన్ ఉద్దేశం. బీజేపీ-జనసేన సంయుక్త ఆధ్వర్యంలో ఇకపై ప్రజలంతా స్వదేశీ వస్తువుల్నే కొనాలని, స్వదేశీ పరిశ్రమలను ప్రోత్సహించాలని, మన దేశ అభివృద్ధిని పెంపొందించాలనే సందేశాన్నిచ్చారు.

అంతా బాగానే ఉంది కానీ, అసలీ స్వదేశీ ప్రచారం చేసే ముందు గతంలో పవన్ కల్యాణ్ ఏయే స్వదేశీ ఉత్పత్తులు వాడారో, “స్వదేశీ”కి ఎంత విలువనిచ్చారో చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు. ఆయన వాడే కారు దగ్గర్నుంచి, బ్రాండెడ్ చెప్పుల వరకు ఏవి స్వదేశీనో, ఏవి విదేశీనో చెప్పాలంటున్నారు. ఇంకొందరు అతిగాళ్లు మరీ ముందుకెళ్లి పవన్ వ్యక్తిగత విషయాల్లో దూరి.. స్వదేశీ వస్తువులేనా, స్వదేశీ వివాహాలు కూడానా అంటూ వెటకారంగా స్పందించారు.

స్వదేశీ, విదేశీ.. అసలీ విధానం ఓ పట్టాన తెమిలేది కాదు. పూర్తిగా అందరూ స్వదేశీ ఉత్పత్తులనే వాడదాం అనుకుంటే.. ఇలా రాజకీయ నాయకులు ప్రకటన చేయాల్సిన పని లేదు, విదేశీ ఉత్పత్తులు భారత్ లో దొరకకుండా చేస్తే ప్రజలంతా ఆటోమేటిగ్గా స్వదేశీ బాటపడతారు. కానీ  ప్రపంచీకరణ నేపథ్యంలో అది అసాధ్యం.

అందుకే ఇలా ప్రజల్ని దోషులుగా చిత్రీకరిస్తూ కేవలం వారిలోనే మార్పు రావాలని ప్రసంగాలిస్తుంటారు నాయకులు. జనసేన అధినేత పవన్ కూడా ఇప్పుడదే పని చేశారు. ఇంతకీ ఈ ప్రవచనాలను పవన్ దేనిలో పోస్ట్ చేశారో తెలుసా..? అచ్చంగా విదేశీ ఫేస్ బుక్ లో.. విదేశీ యూట్యూబ్ లో.. అదీ మన స్వదేశీ నినాదం విలువ.

చంద్రబాబుకి తెలంగాణాలో నోరెత్తే దమ్ములేదు

జగన్ ని ఎలా దెబ్బ కొట్టాలి