మందిర్ అంటూ ఇక ఓటు అడగలేమన్న బీజేపీ నేత!

'రామమందిరం పేరుతో ఇక ఎన్నికలు జరగవు..' అని వ్యాఖ్యానించారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఉమాభారతి. ఒక బీజేపీ నేత ఈ వ్యాఖ్య చేయడం గమనార్హం. అయోధ్య విషయంలో భారతీయ జనతా పార్టీ…

'రామమందిరం పేరుతో ఇక ఎన్నికలు జరగవు..' అని వ్యాఖ్యానించారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఉమాభారతి. ఒక బీజేపీ నేత ఈ వ్యాఖ్య చేయడం గమనార్హం. అయోధ్య విషయంలో భారతీయ జనతా పార్టీ రాజకీయాన్ని ఆమె ప్రస్తావించినట్టుగా అయ్యింది.

భారతీయ జనతా పార్టీ ప్రతి సారీ ఎన్నికల అజెండాలో అయోధ్యలో రామమందిర అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చింది. దశాబ్దాలుగా ఆ పార్టీ ఎన్నికల  మెనిఫెస్టోని గమనిస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది. ప్రతి ఎన్నికల్లోనూ అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని ఎన్నికల హామీగా గుప్పిస్తూ వచ్చింది బీజేపీ.  ఆ మేరకు బీజేపీ కొన్ని సార్లు అధికారాన్ని సొంతం చేసుకుంది కూడా.

వాజ్ పేయి హయాంలో  మొదట పదమూడు నెలలు, ఆ తర్వాత నాలుగున్నరేళ్ల పాటు బీజేపీ దేశాన్ని ఏలింది. అయితే అప్పుడంతా మందిర్ విషయంలో బీజేపీ అధికారంలోకి వచ్చాకా దూకుడుగా వెళ్లలేకపోయింది. గత  ఐదేళ్లలో కూడా బీజేపీ దాన్నొక ఎన్నికల హామీగానే నిలిపింది. అయితే మందిర్ ఎందుకు నిర్మించడం లేదంటూ.. బీజేపీని నిలదీసిన హిందువులు ఎవరూ లేరు. ఎందుకంటే.. ప్రజలకు  అంతకు మించిన అవసరాలు ఎన్నో ఉన్నాయి. వాటి మీదే వాళ్ల దృష్టి.

ఇప్పుడు ఉమాభారతి కూడా అదే మాటే చెప్పారు. ఇక రామమందిరం పేరుతో ఎన్నికలు జరగవని ఆమె వ్యాఖ్యానించారు. రోటీ, కపాడా, విద్యల మీదే ఇక ఎన్నికలు జరుగుతాయని ఆమె వ్యాఖ్యానించారు. ఆహ్వానించదగిన వ్యాఖ్యానం ఇది.