ఉండవల్లికి పట్టని సంగతులు

నికార్సగా, నిఙాయతీగా, పెద్ద మనిషి తనంగా వుండడం తప్పు కాదు. అలా ఉండడం గొప్ప విషయం కూడా. కానీ అలా వుండడం వెనుక కూడా కనిపించని పక్షపాత వైఖరి వుంటే అలాంటి పెద్ద మనుషుల…

నికార్సగా, నిఙాయతీగా, పెద్ద మనిషి తనంగా వుండడం తప్పు కాదు. అలా ఉండడం గొప్ప విషయం కూడా. కానీ అలా వుండడం వెనుక కూడా కనిపించని పక్షపాత వైఖరి వుంటే అలాంటి పెద్ద మనుషుల లక్ష్యాన్ని, చిత్త శుద్దిని శంకించాల్సి వస్తుంది. 

వైఎస్ ఙగన్ పాలన మీద నెలకో సారి వాయిదా పద్దతిన ప్రెస్ మీట్ లు పెడుతూ వస్తున్నారు  ఉండవల్లి అరుణ్ కుమార్. కానీ ఇలా ప్రెస్ మీట్ పెట్టిన ప్రతి సారీ ఙగన్ పాలనను తూర్పార పట్టడం తప్ప మరో వ్యవహారం వుండడం లేదు. అక్కడే ఉండవల్లి చిత్తశుద్ది ప్రశ్నార్ధకమవుతోంది.

రాష్ట్రం ఫైనాన్షియల్ గా ఇబ్బంది కర పరిస్థితుల్లో వుంది. అందులో అనుమానం లేదు.  ఈ విషయం ఉండవల్లి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. నిత్యం ఎల్లో మీడియా చదివితే చాలు ఎక్కడ నుంచి ఎంత అప్పు తెస్తోందో ఏకరవు పెడుతూనే వుంది. కానీ అదే మీడియా 2014 నుంచి 2019 మధ్యలో అప్పుల మీద ఒక్క వార్త ప్రచురించిందా? పసుపు కుంకుమ అంటూ పదివేల వంతున పంచే ముందు వివిధ కార్పొరేషన్ల ద్వారా బ్యాంకుల్లో అప్పు తెచ్చి దాన్ని అటు మళ్లించినపుడు ఓ వార్త అయినా రాసారా? అప్పుడు ఎందుకు రాయలేదు?

సరే.  మళ్లీ ఉండవల్లి విషయానికి వద్దాం. ఇప్పుడు రాష్ట్రప్రభుత్వం కడుతున్న వడ్డీలో చంద్రబాబు హయాంలో చేసిన అప్పులకు కడుతున్నది ఎంత అన్నది ఉండవల్లికి తెలియదా? మూడు రాఙధానుల బిల్లు ను ఙగన్ ఎందుకు వెనక్కకు తీసుకోవాల్సి వచ్చిందో న్యాయవాది అయిన ఉండవల్లికి తెలియదా? అసలు ఏం ఙరుగుతోందో తెలియనంత అమాయకులా ఉండవల్లి.

ఙగన్ ప్రభుత్వాన్ని ఎన్ని విధాలుగా అష్ట దిగ్బంధనం చేసే యత్నాలు ఙరుగుతున్నాయో  ఉండవల్లికి తెలియదా? ఎన్ని విధాల ఎంత మంది ఙగన్ ప్రభుత్వాన్ని చికాకులు పెడుతున్నారో తెలియని సంగతా? వీటి గురించి పొరపాటున అయినా ఏనాడైనా ప్రస్తావించారా?  పోనీ ఇవన్నీ వదిలేద్దాం. ఙగన్ చేస్తున్న పనుల్లో ఒక్కటి అయినా మంచిది లేదా? ఒక్కటి కూడా పొరపాటున కూడా ప్రస్తావించాలన ఉండవల్లికి అనిపించలేదా?   

బోసిడికె అన్న పదం గురించి అంత వర్రీ అవ్వాల్సిన పని లేదు అన్నది ఉండవల్లి మాట. నిఙమే. రాఙకీయ నాయకులను ఎవరైనా ఏదైనా అంటుంటారు. మోడీ అయినా, సోనియా అయినా అతీతులు కారు. పట్టించుకోకూడదు. మరి చంద్రబాబు మాత్రం ఎందుకు పట్టించుకుని నానాయాగీ చేయాలి? న్యాయమూర్తులపై ఎవరో అవాకులు చవాకులు పేలితే ఎందుకు పట్టించుకున్నారు. అది తప్పు అనే కదా? మరి బోసిడకె కూడా తప్పే కదా?

కేవలం ఎల్లో మీడియా మాదిరిగా ఙగన్ ను విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకోవడం వల్ల ఉండవల్లి క్రెడిబులిటీ పూర్తిగా దెబ్బతింటోంది. ఉండవల్లి కూడా ఏ కారణంగానో ఙగన్ ద్వేషిగా మారిపోయారన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఒకసారి కాకపోతే ఒకసారి అయినా ఇరు పక్షాల వైపు నుంచి మాట్లాడితే క్రెడిబులిటీ కనిపిస్తుంది. 

ఉండవల్లికి వున్న గౌరవం నిలబ‌డుతుంది. లేదూ అంటే ఎల్లో మీడియా వార్తలు ఇలా చదివి అలా వదిలేసినట్లు, ఉండవల్లి వీడియోలు కూడా టైమ్ పాస్ వ్యవహారంగా మారిపోతాయి.