జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై అంతేసి తిట్టా…!

త‌మ పాలిట గుదిబండ‌గా నూత‌న పీఆర్సీని తీసుకొచ్చిన జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ఉద్యోగులు, సంబంధిత నాయ‌కులు తీవ్ర ఆగ్ర‌హంగా ఉన్నారు. అంతేకాదు, చ‌ర్చ‌ల పేరుతో పిలిచి అవ‌మానించార‌న్న ఆవేద‌న వారిలో బ‌లంగా ఉంది. ఈ నెల…

త‌మ పాలిట గుదిబండ‌గా నూత‌న పీఆర్సీని తీసుకొచ్చిన జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ఉద్యోగులు, సంబంధిత నాయ‌కులు తీవ్ర ఆగ్ర‌హంగా ఉన్నారు. అంతేకాదు, చ‌ర్చ‌ల పేరుతో పిలిచి అవ‌మానించార‌న్న ఆవేద‌న వారిలో బ‌లంగా ఉంది. ఈ నెల 3న చ‌లో విజ‌య‌వాడ‌కు పిలుపునిచ్చిన నేప‌థ్యంలో, దాన్ని విఫ‌లం చేయ‌డానికి ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంద‌న్న ఆవేద‌న ఉద్యోగుల్లో ఉంది. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ఉద్యోగ సంఘాల నాయ‌కులు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు.

జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ప్ర‌త్య‌ర్థి రాజ‌కీయ పార్టీల కంటే దారుణ‌మైన కామెంట్స్‌ను ఉద్యోగ సంఘాల నేత‌లు చేస్తుండ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. తాజా పీఆర్సీ ప్ర‌కారం ఇచ్చినపే స్లిప్పుల‌ను ఇవాళ విజ‌య‌వాడ రెవెన్యూ భ‌వ‌న్ వ‌ద్ద ఉద్యోగ సంఘాల నేత‌లు త‌గుల‌బెట్టి త‌మ నిర‌స‌న‌ను ప్ర‌ద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా పీఆర్సీ సాధ‌న స‌మితి నాయ‌కుడు బండి శ్రీ‌నివాస‌రావు మీడియాతో మాట్లాడుతూ ప్ర‌భుత్వంపై ఘాటు వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

పీఆర్సీ విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం చేసిన గాయం కంటే క‌రోనా తీవ్ర‌మైందేమీ కాద‌ని ఆయ‌న సీరియ‌స్ కామెంట్స్ చేశారు. ప్ర‌భుత్వానికి మాట‌, మ‌న‌సు మార్చుకునే జ‌బ్బ వ‌చ్చింద‌ని, క‌రోనా కంటే దాని తీవ్ర‌త ఎక్కువని సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. మాట‌మీద లేని ప్ర‌భుత్వం అంతా రివ‌ర్స్‌లో చేస్తోంద‌ని విమ‌ర్శించారు. అంద‌ర్నీ అరెస్ట్ చేసినా క‌నీసం ప‌ది మందితోనైనా చ‌లో విజ‌య‌వాడ ఉద్య‌మాన్ని నిర్వ‌హించి తీరుతామ‌ని బండి హెచ్చ‌రించ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

క‌రోనా మ‌హ‌మ్మారి కంటే ఏపీ స‌ర్కార్ ప్ర‌మాద‌కారి అనే రీతిలో బండి శ్రీ‌నివాస‌రావు విమ‌ర్శించ‌డం రాజ‌కీయంగా క‌ల‌క‌లం రేపుతోంది. ఉద్యోగ సంఘాల తీవ్ర వ్యాఖ్య‌లు ప్ర‌తిప‌క్షాలకు, ఎల్లో మీడియాకు అస్త్రాల‌వుతున్నాయి. 

ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఉద్యోగులను ఉసిగొల్ప‌డానికి ఇదే స‌రైన స‌మ‌యంగా ప్ర‌తిప‌క్షాలు భావిస్తున్నాయి. అందుకు త‌గ్గ‌ట్టుగా వెనుక వైపు నుంచే అంతా న‌డిపిస్తున్నాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.