ఒకవైపు కరోనా కేసుల సంఖ్య దేశంలో విపరీతంగా పెరుగుతూ ఉంది. ప్రస్తుతం దినవారీగా ప్రపంచంలోనే అత్యధిక కేసులు రిజిస్టర్ అవుతున్న దేశంగా నిలుస్తోంది ఇండియా. ఈ క్రమంలో ఆన్ లాక్ ఫోర్ ను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా నాలుగో దశలో .. కొన్ని కొత్త మినహాయింపులను ఇచ్చింది ప్రభుత్వం.
-అందులో ముఖ్యమైనది వంద మంది హాజరీతో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని పేర్కొనడం. ఇప్పటికే పెళ్లిళ్లు ఈ స్థాయి నంబర్ తో జరుగుతూ ఉన్నాయి. కొంతమంది అయితే వేడుకల్లా వివాహాలు చేసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వంద మంది సోషల్-స్పోర్ట్స్-కల్చరల్-మతసంబంధ-రాజకీయ కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. అయితే అది సెప్టెంబర్ 21 తర్వాత మాత్రమే.
-ఇక స్కూళ్లు, థియేటర్లు, ఎంటర్ టైన్ మెంట్ పార్కులను యథాతథంగా మూసి ఉంచాలని కేంద్రం స్పష్టం చేసింది.
-అయితే 9 నుంచి 12 వ తరగతి విద్యార్థులు స్కూల్ కు వెళ్లాలనుకుంటే వెళ్లొచ్చు. ఇందులో ఎలాంటి బలవంతం ఉండకూడదు. ఏవైనా డౌట్స్ ఉంటే టీచర్ల కోసం స్కూలుకు వెళ్లొచ్చు. దీనికి తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం అని కేంద్రం పేర్కొంది.
-ఆన్ లైన్ క్లాసులను బోధించడానికి 50 శాతం స్కూల్ స్టాఫ్ ఆయా పాఠశాలలకు వెళ్లొచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే టీచర్లపై ప్రైవేట్ పాఠశాలలు ఒత్తిడి చేస్తూ ఉన్నాయట. స్కూళ్లుకు రమ్మంటూ వాళ్లపై ఒత్తిడి చేస్తున్నాయని సమాచారం.
-ఓపెన్ ఎయిర్ థియేటర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.
-అంతరాష్ట్ర ప్రయాణాల పట్ల ప్రయాణికులకు, సరుకు రవాణాకూ ఎలాంటి అభ్యంతరాలు, నియమాలు ఉండనక్కర్లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఒకవైపు ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా కరోనా కేసులు రిజిస్టర్ అవుతున్న దేశంగా భారతదేశం నిలుస్తున్న సమయంలో.. దాదాపు పూర్తి స్థాయి సడలింపులు మొదలవుతూ ఉండటం గమనార్హం!