ఉత్తరాంధ్రా గిరిజనుల జీవితాల్లో నవోదయానికి నాందీ ప్రస్థానం జరుగుతోంది. ఉత్తరాంధ్రా జిల్లాల్లో గిరిజనులు పెద్ద ఎత్తున ఉన్నారు. అనేక ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీరందరికీ స్వాతంత్రం లభించి దశాబ్దాలు గడచినా కూడా అభివ్రుధ్ధి పెద్దగా జరగలేదు,
ఇక గిరిజన ప్రాంతాల అభివ్రుధ్ధి విషయంలో ముఖ్యమంత్రి జగన్ ఎప్పటికపుడు చిత్త శుధ్ధిని చాటుకుంటూనే ఉన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 2 గాంధీ జయంతి వేళ విశాఖ, విజయనగరం జిల్లాల్లోని గిరి సీమలకు ప్రగతి కాంతులు వెదజల్లాలని వైసీపీ సర్కార్ నిర్ణయించడం శుభపరిణామమే.
ఆ రోజున కురుపాంలో గిరిజనులకు ఇంజనీరింగ్ కళాశాల, పాడేరులో గిరిజన విశ్వవిద్యాలయం, అక్కడే వైద్య కళాశాలకు కూడా ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా శంఖుస్థాపనలు జరుగుతాయి. ఇక గిరిజన ప్రాంతాలకు సూపర్ స్పెషల్ ఆసుపత్రులు కూడా అదే రోజున జగన్ ప్రారంభిస్తారు.
దాంతో వైసీపీ సర్కార్ ఒకేమారు వైద్య, ఇంజనీరింగ్ కళాశాలలతో పాటు యూనివర్శిటీని కూడా ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతోందన్నమాట. ఇక వైద్యం అంటే గిరిజనులకు అందని పండే. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పటు తో వారికి మేలు చేకూరనుంది, మొత్తానికి గిరిజనుల జీవితాల్లో నవోదయం రానుంది.