ఉత్తరాంధ్రాకు టాప్ చెయిర్

వైసీపీ ఏలుబడిలో ఉత్తరాంధ్రా మీద జగన్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఉత్తరాంధ్రా జిల్లాలు వైసీపీని 2019 ఎన్నికల్లో భుజనికెత్తుకుని ఘనమైన విజయం అందించాయి. ఈ నేపధ్యంలో ఇప్పటికే రాజకీయంగా సామాజికంగా, అభివృద్ధిపరంగా ఈ ప్రాంతానికి…

వైసీపీ ఏలుబడిలో ఉత్తరాంధ్రా మీద జగన్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఉత్తరాంధ్రా జిల్లాలు వైసీపీని 2019 ఎన్నికల్లో భుజనికెత్తుకుని ఘనమైన విజయం అందించాయి. ఈ నేపధ్యంలో ఇప్పటికే రాజకీయంగా సామాజికంగా, అభివృద్ధిపరంగా ఈ ప్రాంతానికి ప్రాధ్యాన్యత ఇచ్చిన జగన్ ఇపుడు పాలనాపరంగా కూడా కీలక అవకాశాన్ని ఇచ్చారు.

ఉత్తరాంధ్రా నుంచి ఏకంగా నాలుగు రెవిన్యూ డివిజన్లను కొత్తగా మంజూరు చేస్తూ వైసీపీ సర్కార్ నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఉత్తరాంధ్రాలో శ్రీకాకుళం జిల్లాలోని పలాసా, విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి, బొబ్బిలి, విశాఖ జిల్లాలో భీమిలీలను రెవిన్యూ డివిజన్ కేంద్రాలుగా చేసి జగన్ చిత్తశుద్ధిని చాటుకున్నారు.

మొత్తం కొత్తగా 22 రెవిన్యూ డివిజన్లు ఏపీ అంతటా ఏర్పాటు చేస్తూంటే అందులో నాలుగు ఈ ప్రాంతానికి ఇవ్వడం అంటే అయిదవ వంతు ఇక్కడే ఇచ్చారన్న మాట. గతంలో ఒక రెవిన్యూ డివిజన్ కావాలీ అంటే దశాబ్దాలు వేచినా అది తీరని కోరికగా ఉండేది. 

ఇపుడు కొత్త జిల్లాలతో పాటు రెవిన్యూ డివిజన్లను కూడా మంజూర్తు చేసి పాలనా వికేంద్రీకరణకు జగన్ అతి పెద్ద ద్వారాలు తీశారని మేధావులు కూడా అంటున్నారు. మొత్తానికి ఉత్తరాంధ్రాకు ఇది అతి పెద్ద వరమనే అంటున్నారు.