ఆర్ఆర్ఆర్ సినిమా బయ్యర్లకు సేఫ్ అనిపించాలని కంకణం కట్టుకున్నట్లుంది ఓ వర్గం. తమ చిత్తానికి అంకెలు ప్రచారం చేస్తూ జనాల్ని మబ్బుల్లో ముంచడానికి ట్రయ్ చేస్తోంది. రోజుకు రోజుకు ఏరియాను బట్టి అంకెలు కలుపుకుంటూ పోతున్నారు.
నైజాంలో ఇప్పటికి 68 కోట్లకు పైగా చేర్చేసారు. గమ్మత్తేమిటంటే తొలి వీకెండ్ తరువాత అంటే సోమ, మంగళ, బుధ వారాల్లో 20 కోట్లకు పైగా నైజాంలో ఆర్ఆర్ఆర్ వసూలు చేసిందట. నమ్మాల్సిందే.
అలాగే సీడెడ్ లో ఇదే మూడు రోజుల్లో ఆరు కోట్లకు పైగా వసూలు చేసేసింది.
విశాఖలో వీకెండ్ తరువాత మూడు రోజుల్లో దగ్గర దగ్గర ఆరు కోట్లు వచ్చేసాయట.
ఈస్ట్ లో ఇదే కాలానికి రెండు కోట్లకుపైగా, వెస్ట్ లో కోటిన్నరకు పైగా వేసి కాస్త కనికరించారు.
గుంటూరులో వీకెండ్ తరువాత మూడు కోట్లకు పైగా, కృష్ణాలో రెండు కోట్లకు పైగా వసూళ్లు వచ్చేసాయట.
పాపం ఇంతలా అంకెలు వేసినా ఏపీ, తెలంగాణ, సీడెడ్ కలిపి ఇంకా ముఫై కోట్లకు పైగా వస్తేనే బయ్యర్లు సేఫ్ అవుతారు. ఇక తమిళనాడు, కర్ణాటక, కేరళ అంకెలు అయితే పాపం ఎంత వేసినా బ్రేక్ ఈవెన్ కు కిలోమీటర్ల దూరంలో వున్నాయి.
మొత్తానికి ఆర్ఆర్ఆర్ ను బయ్యర్లను అంకెల్లో గట్టెక్కించేస్తున్నారు ఎలాగోలా. వీళ్ల బాధ ఇలా వుంది. బయ్యర్ల బాధ అలా వుంది.