ఏ పెద్ద సినిమాకు అయినా రెండు వారాలు గ్యాప్ ఇచ్చి మరో సినిమా విడుదల చేయడం, చేసుకోవడం అన్నది కామన్. అలాగే ఆర్ఆర్ఆర్ తరువాత రెండు వారాలు గ్యాప్ ఇచ్చి డేట్ గని డేట్ వేసేసారు. కానీ చూస్తుంటే అది రైట్ నా? రాంగ్ నా? అన్న సందేహాలు వినిపిస్తున్నాయి.
ఎందుకంటే ఆర్ఆర్ఆర్ సినిమా బయ్యర్లు సేఫ్ అవుతారా? కారా? అన్నపాయింట్ పక్కన పెడితే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 200 కోట్ల కు పైగా ఆడియన్స్ నుంచి లాగేసింది.
జనాలు జేబుల్లోంచి అన్ని డబ్బులు ఊడ్చి ఓ సినిమాకు ఇచ్చేసిన తరువాత మళ్లీ ఆ వెంటనే మరో సినిమాకు ఇవ్వాలంటే కాస్త ఆలోచిస్తారు. అది కూడా ఓ రేంజ్ సినిమా అయితే ఓకె. అలా కాకుండా మిడ్ రేంజ్ సినిమా అయితే ముందు వెనుక ఆడతారు.
ఇప్పుడు గని ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేయాల్సి వుంటుంది. ఎంతో అనుభవం వున్న అల్లు అరవింద్ ఈ డేట్ ను ఎందుకు ఎంచుకున్నట్లో? ఆర్ఆర్ఆర్ విడుదల తరువాత ముందుగా వస్తున్న కాస్త పెద్ద సినిమా ఇదే. 50 కోట్ల బడ్ఙెట్ తో తయారైన వరుణ్ తేజ సినిమా ఇది.
ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్ పడుతుందా? పడదా? అన్నది వచ్చేవారం విడుదలయ్యాక తెలుస్తుంది.