ఉత్తరాంధ్రా ఊదేస్తోంది!

ఆ మూడు జిల్లాలూ టీడీపీకి కంచుకోటలనుకుంటే మాడు పగిలేలా తీర్పు ఇచ్చాయి. 2019 ఎన్నికల్లో మొత్తానికి మొత్తం ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు వైసెపీ పరం అయ్యాయి. అదేదో గాలివాటం గెలుపు అని  ఎపుడు ఎన్నికలు…

ఆ మూడు జిల్లాలూ టీడీపీకి కంచుకోటలనుకుంటే మాడు పగిలేలా తీర్పు ఇచ్చాయి. 2019 ఎన్నికల్లో మొత్తానికి మొత్తం ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు వైసెపీ పరం అయ్యాయి. అదేదో గాలివాటం గెలుపు అని  ఎపుడు ఎన్నికలు పెట్టినా కూడా మాదే విజయం అని టీడీపీ ఇన్నాళ్ళూ చెబుతూ వచ్చింది.

అనుకున్నట్లుగానే లోకల్ బాడీ ఎన్నికలు వచ్చాయి. టీడీపీ దశ కొంతైనా మారుతుందేమో అనుకుంటే అంతకంటే అద్వాన్నంగా సీన్ కనిపిస్తోంది. ఎంపీటీసీలు వందకు పైగా మూడు జిల్లాలో ఏకగ్రీవం అయ్యాయి. జెడ్పీటీసీలు అరడజన్ వరకూ ఏకగ్రీవం చేసుకున్నాయి.

విడ్డూరం కాకపోతే ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కళా వెంకటరావు  ఇలాకా రాజాంలో ఎంపీటీసీలు వైసీపీకి అనుకూలంగా ఏకగ్రీవం కావడం. అలాగే మాజీ మంత్రులు, సామంతులు అనుకున్న పచ్చ పార్టీ పెద్దల లోగిళ్ళల్లోనూ ఫ్యాన్ గిర్రున తిరుగుతోంది.

ఇపుడున్న సీన్ బట్టి చూస్తూంటే మూడు జెడ్పీటీసీలు, కార్పోరేషన్లూ వైసీపీ ఖాతాలో పడిపోయే సూచనలు కచ్చితంగా కనిపిస్తున్నాయి.  మొత్తం మీద చూసుకుంటే ఉత్తరాంధ్రా ఇపుడు టీడీపీకి కంచుకోట కాదు, బీటలు వారిపోతోంది. గత వైభవమైపోతోంది.

ఉత్తారాంధ్రా జిల్లాలు  నాలుగు దశాబ్దాలుగా ఆదరిస్తూ వస్తున్న చోటనే పసుపు పార్టీ  పాతాళానికి జారితే ఇంక భవిష్యత్తు ఎలా ఉంటుందో మరి.

స్క్రిప్టులో వేలు పెట్టట్లేదు..

నేను గ్యాప్ తీసుకోలేదు.. వచ్చింది