వాళ్లకు కరోనా తగలాలి-కేసిఆర్

కొందరు తిడితే ఓ పద్దతిగా వుంటుంది. వినాలనిపిస్తుంది. తిడుతున్నట్లు వుండదు. స్టాండింగ్ కామెడీ చేస్తున్నట్లుగా వుంటుంది. అందుకే ఎవ్వరూ కోపం తెచ్చుకోరు కూడా. తెలంగాణ సిఎమ్ కేసిఆర్ స్టయిల్ అదే. అవతలవాళ్లను చాలా స్మూత్…

కొందరు తిడితే ఓ పద్దతిగా వుంటుంది. వినాలనిపిస్తుంది. తిడుతున్నట్లు వుండదు. స్టాండింగ్ కామెడీ చేస్తున్నట్లుగా వుంటుంది. అందుకే ఎవ్వరూ కోపం తెచ్చుకోరు కూడా. తెలంగాణ సిఎమ్ కేసిఆర్ స్టయిల్ అదే. అవతలవాళ్లను చాలా స్మూత్ గా ఇలా తీసి అలా పక్కన పెడతారు. సింపుల్ గా వాళ్ల గాలి తీసేస్తారు. ఒక్కోసారి గట్టిగా కూడా విమర్శిస్తారు. కానీ వార్నింగ్ లు ఇవ్వడం మాత్రం చాలా  రేర్.

నిన్నటికి నిన్న కేసిఆర్ తన స్టయిల్ ను ఈ వార్నింగ్ లెవెల్ కు తీసుకెళ్లారు. ఓ మీడియా పేరు ఎత్తకుండానే చాలా సేపు కడిగి పారేసారు. తెలంగాణలో వైద్యులకు రక్షణ లేదంటూ కథనాలు వండి వార్చింది ఓ మీడియా. ఈ మీడియా ఆది నుంచీ కేసిఆర్ అంటే కాస్త వ్యతిరేకంగా వుంటూనే వస్తోంది. మధ్య మధ్యలో కాస్త రాజీకి వస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల టైమ్ లో మళ్లీ తన స్వామి భక్తి చూపించుకుని, చంద్రబాబు వైపు మొగ్గింది.

ఇవన్నీ కేసిఆర్ కు తెలియనివి కాదు. అయినా ప్రస్తుతానికి పెద్దగా డ్యామేజ్ లేదని సైలంట్ గా వున్నారు. కానీ కరోనా టైమ్ లో ఈకథనాలు ఆయన సహనాన్ని బరస్ట్ చేసేసాయి. అందుకే తన స్టయిల్ లోనే మాట్లాడుతూనే, ఘాటైన పదాలు వాడారు. ఒక దశలో టెర్రరిస్ట్ వ్యవహారాలు. అన్నారు. ప్రస్తుతానికి కరోనా మీద దృష్టి పెట్టినా, ఈ మీడియా పని పడతాం కానీ వదిలేయం అని హెచ్చరించారు. 

''..చిల్లరగాళ్లు, దుర్మార్గాలు మానుకోవడం లేదు. అవసరం అయితే కేసు కూడా వేస్తాం. ఇలాగే కొనసాగితే శిక్ష తప్పదు. ఇలాంటి వాళ్లకు కరోనా తగలాలని శాపం పెడుతున్నా. కరోనా వస్తే ఆ బాద వాళ్లకు తెలుస్తుంది. దీన్ని తేలిగ్గా తీసుకోను, ఈ దుర్మార్గులను ఐడెంటిఫై చేసి, యాక్షన్ తీసుకుంటాం. కేసిఆర్ చెబితే ఖతర్నాక్ గా వుంటుంది '' అని కేసిఆర్ అన్నారు.

ఇది మీడియా అంతటికి కాదు, ఎవరైతే దుర్మార్గపు ఆలోచనలతో, అసత్యాలు ప్రచారం చేస్తున్నారో వాళ్లకే అని కూడా కేసిఆర్ అనడం విశేషం.

ఈ లాక్ డౌన్ పెంచమని మోదీగారిని కోరతాను

ప్రధాన మంత్రిగారి మీదే జోకులు వేసే చిల్లరగాళ్ళు ఉన్నారు