వ్యాక్సిన్ల క‌న్నా.. క‌రోనా సోకడ‌మే మేలా..!

క‌రోనా నివార‌ణ వ్యాక్సిన్ల గురించి చ‌ర్చ కొన‌సాగుతూ ఉంది. ఇప్ప‌టికే రెండు డోసుల వ్యాక్సిన్లు వేసుకున్న వారు కూడా మ‌ళ్లీ క‌రోనాకు గురి కార‌నే గ్యారెంటీ ఏ మాత్ర‌మూ లేదు. రెండో డోసు వ్యాక్సిన్…

క‌రోనా నివార‌ణ వ్యాక్సిన్ల గురించి చ‌ర్చ కొన‌సాగుతూ ఉంది. ఇప్ప‌టికే రెండు డోసుల వ్యాక్సిన్లు వేసుకున్న వారు కూడా మ‌ళ్లీ క‌రోనాకు గురి కార‌నే గ్యారెంటీ ఏ మాత్ర‌మూ లేదు. రెండో డోసు వ్యాక్సిన్ వేయించుకున్న మూడు నెల‌ల త‌ర్వాత కూడా క‌రోనాకు గురైన వారెంతో మంది ఉన్నార‌ని తెలుస్తోంది. ఇలాంటి వారు మైల్డ్ సింప్ట‌మ్స్ తో బ‌య‌ట‌ప‌డ్డారు.

అయితే ఎలాంటి వ్యాక్సిన్ లేప్పుడు కూడా… నూటికి 98 శాతం మంది క‌రోనా నుంచి తేలిక‌గానే కోలుకున్నారు. వీరిలో గాబ‌రాప‌డి వైద్యులు రాసిన స్టెరాయిడ్లు వాడి ఉండ‌వ‌చ్చు కానీ, గ్రామాల్లో అయితే క‌రోనా టెస్టుల‌కు కూడా వెళ్ల‌కుండా కోలుకున్న వారు కోకొల్ల‌లు.

మ‌రి వ్యాక్సిన్ వేయించుకున్నాకా మైల్డ్ సింప్ట్స‌మ్స్, వ్యాక్సిన్ వేయించుకోకుండా న్యాచుర‌ల్ ఇమ్యూనిటీతో క‌రోనాను జ‌యించిన వారు కోట్ల‌లో ఉన్నారు. మ‌రి ప్ర‌భుత్వం చెప్పిందని, ఇత‌రుల ఆరోగ్య భ‌ద్ర‌త‌ను కూడా దృష్టిలో ఉంచుకుని భార‌తీయ పౌరుల్లో కోట్ల మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే ఇప్పుడు మ‌ళ్లీ మూడో డోసు అంటూ స‌హ‌జ‌మైన ఇమ్యూనిటీని దెబ్బ తీస్తున్నారే విమ‌ర్శ‌లు తీవ్రంగా వ‌స్తున్నాయి.

వ్యాక్సిన్లు జ‌న‌రేట్ చేస్తున్న యాంటీ బాడీల‌పై ప‌రిశోధిస్తున్న వారు చిత్ర‌విచిత్ర‌మైన విష‌యాలు చెబుతున్నారు. వ్యాక్సిన్ వేసుకుంటే 90 శాతం రెసిస్టెన్స్ అంటారు. మామూలుగానే 98 శాతం తేలిక‌గా బ‌య‌ట‌ప‌డుతున్న‌ప్పుడు మ‌ళ్లీ వ్యాక్సిన్ వ‌ల్ల ద‌క్కే ప్ర‌యోజ‌నం 90 శాతం అట‌! అంటే మిగిలిన రెండు శాతం మందిలో 90 శాతం మందికి వ్యాక్సిన్లు అండ‌గా నిల‌వ‌వ‌చ్చేమో!

అయితే ఈ వ్యాక్సిన్ల సమ‌ర్థ‌త‌పై కూడా ర‌క‌ర‌కాల మాట‌లు. కొంద‌రేమో అర‌వై శాతం, ఇంకొంద‌రు యాభై శాతం అని చెప్పుకొచ్చారు. మ‌రి కొన్ని ప‌రిశోధ‌న‌లు అయితే వ్యాక్సిన్ వేయించుకున్న మూడు నెల‌ల్లోనే యాంటీ బాడీల ఉత్ప‌త్తి త‌గ్గిపోయింద‌ని చెబుతున్నాయి! ఇలా అని చెప్పి ప్ర‌తి మూడు నెల‌ల‌కూ ఒక డోసు వ్యాక్సిన్ వేయించుకోవాలా? వేయించుకుంటే శ‌రీరానికి ఉన్న స‌హ‌జ సిద్ధ‌మైన ఇమ్యూనిటీ ఏమ‌వుతోందో!

ఈ ర‌చ్చ అంతా బ‌దులు..  ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో వ్యాక్సిన్ ల‌ను గుడ్డిగా న‌మ్మ‌డం కంటే ఒక సారి క‌రోనాకు గురి కావ‌డ‌మే మంచిదేమో అనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. ఇప్పుడు క‌రోనాకు గురైన వారిలో చాలా మంది రెండు మూడు రోజుల సింప్ట‌మ్స్ తో బ‌య‌ట‌ప‌డుతున్నారు. వారం రోజుల వ్య‌వ‌ధిలో నెగిటివ్ రిపోర్టు చూపిస్తున్నారు. దీని వ‌ల్ల వీరిలో యాంటీ బాడీస్ ఉత్ప‌త్తి గ‌ణ‌నీయంగా జ‌ర‌గడం, మ‌ళ్లీ తేలిక‌గా క‌రోనాకు గురి కాక‌పోవ‌డం జ‌ర‌గ‌వ‌చ్చు. 

వ్యాక్సిన్ వేయించుకున్నా క‌రోనా సోక‌ద‌నే గ్యారెంటీ  లేదు, వ్యాక్సిన్ వ‌ల్ల సైడ్ ఎఫెక్ట్స్ భ‌యాలు ఇండియాలో ఇంకా భారీగానే ఉన్నాయి. మ‌ళ్లీ మ‌ళ్లీ వ్యాక్సిన్లు వేయించుకోవ‌డం పై రెండో డోసులు పొందిన వారిలో కూడా పెద్ద‌గా ఆస‌క్తి క‌నిపించ‌డం లేదు. ఈ ప‌రిణామాల‌న్నింటి నేప‌థ్యంలో.. వ్యాక్సిన్ల క‌న్నా, తేలిక పాటి వేరియెంట్ క‌రోనానే సుర‌క్షితంగా క‌నిపించ‌డం పెద్ద వింత కాదు.