టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును టార్గెట్ చేస్తూ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వరుసగా సవాళ్లు విసురుతున్నారు. ఉమాపై విమర్శల వాడి పెరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీడియాతో మాట్లాడుతూ ఉమాపై విరుచుకుపడ్డారు.
ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, వదినను చంపిన ఉమా రాజకీయాల్లో విలువలు గురించి మాట్లాడ్డం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్లేస్, టైమ్, డేట్ ఉమా ఫిక్స్ చేయాలని వంశీ సవాల్ విసిరారు.
తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని.. సవాల్ అయినా ప్రతి సవాల్ అయినా తాము సిద్ధంగా ఉన్నట్టు వంశీ తేల్చి చెప్పారు. గత సార్వత్రిక ఎన్నికల ముందు పసుపు.. కుంకుమ ఇస్తే ప్రజలు టీడీపీకి కోసి కారం పెట్టారని చురకలు అంటించారు.
మాజీ మంత్రి దేవినేని ఉమ దీక్షపై వంశీ స్పందించారు. అర్థంపర్థం లేని ఆరోపణలు చేసి చర్చకు రా అంటే ఎలా అని వంశీ ప్రశ్నించారు. చంద్రబాబు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
తాము చర్చ పెట్టుకుందామని చెప్పామే తప్ప కొట్లాటకు రావాలని పిలవలేన్నారు. ఒకటి అని రెండు అనిపించుకోవడం ఉమాకి అలవాటేనని వంశీ అన్నారు. ఎన్టీఆర్ టీడీపీ వేరు.. చంద్రబాబు టీడీపీ వేరు అని వంశీ చెప్పుకొచ్చారు.
మాజీ మంత్రి ఉమా ఒక లోఫర్ అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన ఇంట్లో అనేక కులాలు ఉన్నాయని, అన్ని కులాలు ఓట్లు వేస్తేనే తాము గెలిచామని వంశీ చెప్పారు.
కేవలం ఒక కులాన్ని టార్గెట్ గా ప్రభుత్వం పని చేస్తోందని ఆరోపించడం పూర్తిగా అవాస్తవమన్నారు. ఒక కులం వాళ్లు ఓట్లు వేస్తే తాను, నాని ఎమ్మెల్యేలుగా గెలవలేదన్నారు. ఇప్పటికైనా ఉమా పిచ్చి మాటలు మానుకోవాలని వల్లభనేని వంశీ కోరారు.