వంగపండుకు అరుదైన గౌరవం

వంగపండు ప్రసాదరావు. ఉత్తరాంధ్రా శ్రీశ్రీగా పేరు గడించారు. ఆయన జానపద కళాకారుడిగా మన్ననలు అందుకున్నారు. దాదాపుగా ఆరు దశాబ్దాల పాటు వాగ్గేయకారుడిగా అనేక ప్రజా సమస్యల మీద గొంతెత్తారు. అలవోకగా పాటలు కట్టి జనాలను…

వంగపండు ప్రసాదరావు. ఉత్తరాంధ్రా శ్రీశ్రీగా పేరు గడించారు. ఆయన జానపద కళాకారుడిగా మన్ననలు అందుకున్నారు. దాదాపుగా ఆరు దశాబ్దాల పాటు వాగ్గేయకారుడిగా అనేక ప్రజా సమస్యల మీద గొంతెత్తారు. అలవోకగా పాటలు కట్టి జనాలను చైతన్యపరచారు.

అటువంటి వంగపండు ప్రసాదరావు గత ఏడాది పరమపదించారు. ఆయన కళా రంగానికి చేసిన సేవలకు గానూ అనాటి  ప్రభుత్వాలు పౌర పురస్కారాలు ఏవీ ప్రదానం చేయలేదు. కానీ ఆయన మరణించిన తరువాత మాత్రం జగన్ సర్కార్ గుర్తుపెట్టుకుని మరీ ఆ మహనీయుడి కీర్తిని శాశ్వతం చేసింది.

వంగపండు కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్ధిక సాయాన్ని తాజాగా ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్ ఆయన పేరిట జానపద పురస్కారాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయడం వంగపండుకు అందించిన ఘనమైన నివాళిగా చెప్పుకోవాలి.

ప్రతీ ఏటా ఆగస్ట్ 4న వంగపండు పేరిట జానపద కళా పురస్కారాన్ని ప్రతిభావంతులైన కళాకారులకు వైసీపీ సర్కార్  అందచేయనుంది. రెండు లక్షల రూపాయలతో నగదుతో సత్కరించనుంది. 

మొత్తానికి వంగపండు తానే ఒక అవార్డుగా మారి తన కీర్తిని శాశ్వతం చేసుకోవడం ఉత్తరాంధ్రాకే గర్వకారణమైతే ఆయన్ని సమాదరించిన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా అభినందించి తీరాల్సిందే.