ఇంకా వేలాడుతూనే ఉన్న వర్ల.. వార్నింగ్!

ఆర్టీసీ చైర్మన్ గా ఇంకా వర్ల రామయ్యే ఉన్నారంటే చాలామంది ఆశ్చర్యపోతారు. ఒకవైపు వీర తెలుగుదేశం పార్టీ నేతలా రియాక్ట్ అయిపోయి, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ఇష్టానుసారం మాట్లాడే ఈయన.. జగన్ సర్కారులో ఆర్టీసీ…

ఆర్టీసీ చైర్మన్ గా ఇంకా వర్ల రామయ్యే ఉన్నారంటే చాలామంది ఆశ్చర్యపోతారు. ఒకవైపు వీర తెలుగుదేశం పార్టీ నేతలా రియాక్ట్ అయిపోయి, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ఇష్టానుసారం మాట్లాడే ఈయన.. జగన్ సర్కారులో ఆర్టీసీ చైర్మన్ గా కొనసాగుతూ ఉన్నారు. ఈ తెలుగుదేశం పార్టీ  నిష్టాగరిష్టుడికి.. చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారు, తనబోటి వాళ్లు నామినేటెడ్ పోస్టులకు రాజీనామా చేయాలనే కనీస స్పృహ కూడా లేకపోవడం గమనార్హం.

వాస్తవానికి ఆర్టీసీ చైర్మన్ పదవీకాలమే ఏడాది అట. ఆ లెక్కన కూడా ఈయన పదవీకాలం ముగిసిపోయింది. అయినా.. ఈయన ఆ పదవినే పట్టుకుని వేలాడుతూ ఉండటం గమనార్హం. తన హోదాకు, జీతభత్యాలకూ ఆ పదవిని వాడుకొంటూ.. ఈయన చలామణి అయిపోతున్నారు. ప్రభుత్వం కూలిపోగానే రాజీనామా చేసి వెళ్లక, పదవీకాలం ముగిసినా దాని ద్వారా వచ్చే బెనిఫిట్స్ ను వదలక.. ఈయన ఇంకా కొనసాగుతూనే ఉన్నారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో వర్లకు ప్రభుత్వం నుంచి నోటీసులు వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఆ పదవి నుంచి ఇకనైనా గౌరవంగా తప్పుకోవాలని, లేకపోతే తప్పించాల్సి వస్తుందని వార్నింగ్ లెటర్ వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ ఈయన విషయంలో ఓపికగా చూస్తున్న ప్రభుత్వ తీరు కూడా ఆశ్చర్యకరమే. 

వీర తెలుగుదేశం నేతలా వ్యవహరించే ఈయనను గౌరవంగా ప్రభుత్వమే ఆ హోదా నుంచి తప్పించేసి ఉండాల్సింది. అయితే ఎన్నో నీతులు చెప్పే వర్ల రామయ్య ఈ పదవిని పట్టుకుని ఇంకా వేలాడుతూ ఉంటూ.. తెలుగుదేశం వాళ్ల తీరెలా ఉంటుందో చాటి చెబుతున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.

రాజమౌళికి హ్యాట్సాఫ్ చెప్తున్నా.. సైరా డైరెక్టర్