ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా ప్రతినిధులు ఉండేది. ఆ మాటకు వస్తే ఆయన నేరుగా జనాల నుంచి ఎన్నికైన వారు కాదు, రాజ్యసభ మెంబర్. అయినా కూడా అనునిత్యం ప్రజలలో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఆయనే వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత. విశాఖను నోడల్ జిల్లాగా తీసుకున్న వి విజయసాయిరెడ్డి.
విజయసాయిరెడ్డి ప్రజాదర్బార్ నిర్వహిస్తున్న సంగతి విధితమే. ఆయన క్యాంప్ ఆఫీస్ లో ప్రజాదర్బార్ అంటే వందల సంఖ్యలో ప్రతి నిత్యం ప్రజలు అక్కడకి వచ్చి వాలుతారు. ఇక విజయసాయిరెడ్డి ఓపికకు మెచ్చుకుని తీరాల్సిందే. వచ్చిన వారి సమస్యలను ఓపికగా విని వాటి సత్వర పరిష్కారం కోసం విజయసాయిరెడ్డి చూపిస్తున్న శ్రద్ధకు అందరూ ముగ్దులవుతున్నారు.
ఇదిలా ఉంటే కరోనా వేళ కూడా ప్రత్యేక చర్యలు తీసుకుని మరీ విజయసాయిరెడ్డి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఇక తన దగ్గరకు వచ్చిన సమస్యలకు వారం రోజులలో పరిష్కారం కావాలని సంబంధిత శాఖ అధికారులను విజయసాయిరెడ్డి ఆదేశించడం కూడా విశేషం.
మొత్తానికి వినతులు స్వీకరించడమే కాదు, వాటికి తగిన తరుణోపాయం చూపించడంతో విజయసాయిరెడ్డి ప్రజా దర్బార్ కి వచ్చే వారిసంఖ్య అంతకంతకు పెరుగుతోంది. సమస్యలతో అక్కడకు వచ్చిన వారు ఫుల్ హ్యాపీగా వెనుతిరగడమే గొప్పగా చెప్పుకోవాలి. అధికారులు సైతం ఎంపీ చెప్పిన విధంగా త్వరగా సమస్యల సాధనకు కృషి చేస్తామని చెప్పడం కూడా మంచి పరిణామంగా చూడాలి.