సోషల్ మీడియా వేదికగా మరోసారి పంచ్ లు పేల్చారు విజయసాయి రెడ్డి. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కేంద్రంగా తాజాగా వెలుగుజూసిన కుంభకోణాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు, లోకేష్ పై తిరుగులేని సెటైర్లు వేశారు. మరీ ముఖ్యంగా ఇంత జరుగుతున్నప్పటికీ అచ్చెన్నాయుడు ధీమాగా ఉండడానికి ఓ కారణం ఉందంటున్నారు విజయసాయి. అదేంటో, ఆ ట్వీట్ ఏంటో మీరే చూసేయండి.
“అచ్చన్న దోచుకున్న ప్రతి రూపాయిలో సగం లోకేశ్ కు పంపించాడు. పార్టీ అండగా నిలవక పోతే డైరీలన్నీ బయటకు తీస్తానని బెదిరిస్తున్నాడట. లోకేశ్ చెబితేనే లేఖ రాశానని సన్నిహితుల వద్ద వాపోతున్నాడట. తండ్రీ కొడుకుల కనుసన్నల్లోనే కుంభకోణం జరిగింది. అందుకే అచ్చన్న ధీమాగా ఉన్నాడు.”
ఇలా లోకేష్, చంద్రబాబుపై ఓ రేంజ్ లో సెటైర్లు వేశారు విజయసాయి. అంతేకాదు.. ఈ మొత్తం వ్యవహారం బాబుకు చుట్టుకోవడం ఖాయం అనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు విజయసాయి. ఏ జైలుకెళ్లాలో బాబు ముందుగానే సెలక్ట్ చేసుకుంటే బెటరని పంచ్ లేశారు.
“ఆ జైలు కెళ్తావా చంద్రన్న, ఈ జైలు కెళ్తావా? ఆ పక్కనేమో వైజాగ్ సెంట్రల్, ఈ పక్కనేమో కడప కారాగారం. నడిమధ్యనున్నది రాజమండ్రి చెరసాల… అని సోషల్ మీడియా కుర్రకారు తెగ ఊగిపోతున్నారు. పాపం అసలే ఎండాకాలం. రెండు ఏసీలేసుకుని పడుకునే వాడు. ఎలా తట్టుకుంటాడో ఏమో?”
దమ్ముంటే దర్యాప్తు చేయించుకోండంటూ నిన్నమొన్నటివరకు ప్రేలాపనలు పేలిన నేతలంతా ఇప్పుడు ముందుకురావాలన్నారు విజయసాయి. కుక్కిన పేనుల్లా మారిన అలాంటి నేతలంతా ఇప్పుడు సిట్ ముందుకొచ్చి, తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. అమరావతి కోసం నౌకాదళాన్ని కూడా వివాదంలోకి లాగారని, పచ్చ పార్టీ నేతలపైన దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.