అచ్చెన్న శ్రేయోభిలాషిగా మారిన విజ‌య‌సాయి…

మాజీ మంత్రి, టీడీపీ నాయ‌కుడు అచ్చెన్నాయుడు శ్రేయోభిలాషిగా వైసీపీ రాజ్య‌స‌భ్య స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి మారారు. ఈఎస్ఐ కుంభ‌కోణం కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ అయిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న రిమాండ్‌లో…

మాజీ మంత్రి, టీడీపీ నాయ‌కుడు అచ్చెన్నాయుడు శ్రేయోభిలాషిగా వైసీపీ రాజ్య‌స‌భ్య స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి మారారు. ఈఎస్ఐ కుంభ‌కోణం కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ అయిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న రిమాండ్‌లో ఉన్నాడు. అనారోగ్య కార‌ణంతో గుంటూరులో ఏసీబీ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స తీసుకుంటున్నాడు.

ఇదిలా ఉండ‌గా ఏదో ఒక అంశంపై చంద్ర‌బాబు, లోకేశ్ త‌దిత‌ర టీడీపీ ప్ర‌ముఖ నాయ‌కుల‌పై విజ‌య‌సాయిరెడ్డి సోష‌ల్ మీడియా వేదిక‌గా ఘాటైన విమ‌ర్శ‌లు చేసే విష‌యం తెలిసిందే. తాజాగా ఆయ‌న అచ్చెన్నాయుడి శ్రేయ‌స్సు  కోరి కేసు నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు కొన్ని ఉపాయాలు చెబుతున్నారు. ఈ మేర‌కు విజ‌య‌సాయి ట్వీట్ చేశారు.

‘ అచ్చెన్న కచ్చితంగా బాబు గారి బినామీనే. ఆయన ద్వారానే భూముల కొనుగోళ్లు, వ్యాపారాల్లో వేల కోట్లు పెట్టుబడులుగా పెట్టారని సొంత పార్టీలో చర్చించుకుంటున్నారు. బాబు రాయమంటేనే సిఫారసు లేఖలు రాసానని అంగీకరించి, గుట్లు మట్లన్నీ చెప్పేస్తే కేసు నుంచి బయటపడొచ్చేమో చూడండి అచ్చెన్నా’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

అచ్చెన్న బ‌తుకు కోరి విజ‌య‌సాయి మంచి మాట‌లు చెబుతూనే…మ‌రోవైపు చంద్ర‌బాబును ఇరికించే ప్లాన్ స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అవును, వాహ‌నాల కుంభ‌కోణం కేసులో జైలుపాలైన జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, ఆయ‌న త‌న‌యుడు బ‌య‌టికి రావాలంటే ఏం చేయాలో విజ‌య‌సాయిరెడ్డి చెప్ప‌లేదేం! జేసీ కోసం ఇంకో ట్వీట్ చేస్తారా? ఏమో చూద్దాం. 

బాబు లోకేష్.. వణుకు పుడుతోందా?

లోకేష్ చిప్పకూడుమీద ఆశపడుతున్నాడు