అవును, విశాఖ గ్రేట్. ఎంత గ్రేట్ అంటే హైదరాబాద్ కి సరిసాటిగా నిలిచే సిటీగా గ్రేట్ అని ఒప్పుకోవాలి. ఉమ్మడి ఏపీకి రాజధాని. దానికి కోల్పోయామని ఏపీ జనాలు ఈ రోజుకీ బాధ పడుతూ ఉంటారు. అయితే విభజన ఏపీకి విశాఖ అంతటి సామర్ధ్యం కలిగిన సిటీ అని పదే పదే రుజువు అవుతూ ఉంది. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ కి పోటీగా నిలిచింది విశాఖ మాత్రమే.
ఈ మధ్యనే అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖను రాజధానిగా చేస్తే హైదరాబాద్ కి మాత్రమే కాదు, బెంగుళూరు, చెన్నై వంటి మహా నగరాలకు ధీటైన జవాబు చెబుతామని, అభివృద్ధి లో దూసుకుపోతామని చెప్పారు. అది నిజమని చెప్పే విధంగా విశాఖ ఈ రోజుకే హైదరాబాద్ ని మించేసింది.
పట్టణ ప్రాంతాల అభివృద్ధి సూచికలో విశాఖ హైదరాబాద్ ని పక్కకు నెట్టేసి తానే ముందుకు దూసుకువచ్చింది. ఇది ఎవరో చెప్పినది కాదు, నీతి అయోగ్ వెల్లడించిన నివేదికలో స్పష్టంగా ఉంది. దేశంలోని అభివృద్ధి సూచికను అందుకున్న నగరాల్లో విశాఖకు పద్దెనిమిదవ స్థానం లభించింది అంటే నిజంగా గ్రేటే.
నీతి అయోగ్ పేర్కొన్న పన్నెండు విభాగాల్లో మొత్తం అరవై మార్కులు సాధించి విశాఖ హైదరాబాద్ కంటే మిన్నగా నిలిచింది. మరి ఈ పరిస్థితుల్లో విశాఖను పరిపాలనా రాజధానిగా చేసుకుంటే కచ్చితంగా పదేళ్ల లోపే సౌతిండియాలోనే నంబర్ వన్ మెగా సిటీ అవుతుంది అనడంలో సందేహమే లేదని మేధావులు అంటున్నారు. మొత్తానికి జగన్ విశాఖ వైపు ఎందుకు చూస్తున్నారు అంటే అందులో ఎంతటి విజ్ఞత, ముందు చూపు ఉన్నాయో అర్ధం అవుతోందిగా.