విశాఖ రైల్వే జోన్…ఎంతెంత దూరం…?

ఎంతెంత దూరం…కూత వేటు దూరం అని చిన్నప్పుడు ఒక పాటను  పిల్లలు పాడుకునేవారు. ఆటలాడుకునేవారు. విశాఖ రైల్వే జోన్ తతంగం చూస్తే ఆ పాటే మళ్ళీ గుర్తుకువస్తోంది. విశాఖ రైల్వే జోన్ ఎంత దూరంలో…

ఎంతెంత దూరం…కూత వేటు దూరం అని చిన్నప్పుడు ఒక పాటను  పిల్లలు పాడుకునేవారు. ఆటలాడుకునేవారు. విశాఖ రైల్వే జోన్ తతంగం చూస్తే ఆ పాటే మళ్ళీ గుర్తుకువస్తోంది. విశాఖ రైల్వే జోన్ ఎంత దూరంలో ఉంది అంటే ఇప్పటికీ  ఢిల్లీలోనే ఉంది. అక్కడ నుంచి కూత పెట్టుకుంటూ విశాఖ రావాలీ అంటే ఎంత కాలం పడుతుంది అంటే జవాబు అయితే కచ్చితంగా ఇంతా అని చెప్పలేరేమో.

విశాఖ రైల్వే జోన్ విషయంలో ఇంకా చాలానే కసరత్తు ఉన్నట్లుగా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాటలను బట్టి తెలుస్తోంది. రైల్వే జోన్ కి కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది అని ఒక శుభవార్తను ఆయన చెప్పారు.

దాంతో పని అయిపోయిందనుకుంటే పొరపాటే. అసలు కధ అక్కడ నుంచే నడవాలి. దక్షిణ కోస్తా కొత్త రైల్వే జోన్ విషయంలో మరింత లోతైన అధ్యయనానికి సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ లెవెల్ కమిటీని ఏర్పాటు చేసినట్లుగా కేంద్ర మంత్రి చెబుతున్నారు.

ఆ కమిటీ కొత్త రైల్వే జోన్, రాయగడ రైల్వే డివిజన్ ఏర్పాటు పరిధి, ఇతర అంశాలకు సంబంధించి పలు విషయాల మీద అధ్యయనం చేసి నివేదిక ఇస్తుంది. ఆ మీదటనే విశాఖ రైల్వే జోన్ విషయంలో ముందుకు అడుగులు వేస్తారు అని తెలుస్తోంది. మొత్తానికి చూస్తే ఇప్పటిదాకా డీపీయార్ విషయంలో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇపుడు గ్రౌండ్ లెవెల్ కమిటీ నివేదిక కోసం ఆగాలి.

మరి ఆ నివేదిక వచ్చాకనే విశాఖ రైల్వే జోన్ కూత పెట్టేది అని తెలుస్తోంది. అంటే ఇప్పటికైతే కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందింది అన్న శుభవార్తను వింటూ మరి కొన్నాళ్ళు ఆనందించడమే మిగిలింది అంటున్నారు.