ఉక్కు మీద తుక్కు పాట‌

విశాఖ ఉక్కు కర్మాగారం కేంద్ర ప్రభుత్వానిది. అది మా ఆస్తి. మేము ఏమైనా చేసుకుంటామని బీజేపీ పెద్దలు అనడమూ విధితమే. అదే టైం లో దాన్ని ప్రైవేట్ పరం చేయవద్దు అని బీజేపీ తప్ప…

విశాఖ ఉక్కు కర్మాగారం కేంద్ర ప్రభుత్వానిది. అది మా ఆస్తి. మేము ఏమైనా చేసుకుంటామని బీజేపీ పెద్దలు అనడమూ విధితమే. అదే టైం లో దాన్ని ప్రైవేట్ పరం చేయవద్దు అని బీజేపీ తప్ప అన్ని పార్టీలు గట్టిగానే చెబుతున్నాయి.

కానీ కేంద్రం మాత్రం పట్టుదలగా ఉంది. విశాఖ ఉక్కు నష్టాల్లో ఉంది. మేము భరించలేమని అంటోంది. ప్రైవేట్ పరం చేస్తామని ఉక్కు మంత్రి రామచంద్రప్రసాద్ సింగ్ సభలోనే స్పష్టం చేశారు కూడా.

దీంతో పోరాడాల్సింది ఎవరి మీద అన్నది అందరికీ అర్ధమవుతోంది. కానీ టీడీపీ మాత్రం అర్జంటుగా ఎంపీలు రాజీనామా చేయాలని ఉక్కు మీద తుక్కు పాట‌ అందుకుంది.

విశాఖ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు అయితే మొత్తానికి మొత్తం ఎంపీలు రాజీనామా చేస్తేనే ఉక్కు ప్రైవేటీకరణ ఆగుతుంది అంటున్నారు. మరి రాజీనామాలు చేస్తే ఉక్కు ప్రీవేట్ పరం చేయబోమని ఎవరైనా చెప్పారా. పైగా ఏపీలో ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రానికి చీమ కుట్టినట్లు అయినా ఉంటుందా.

వారికి 303 సీట్లున్నాయి. మిత్రులు ఉన్నారు. అధికారానికి ఢోకా లేని స్థితి. మరి ఇది రాజకీయంగా సరైన వ్యూహమేనా అంటే విషయం అంది కాదు, వ్యవహారాన్ని అటు తిప్పి ఇటు తిప్పి వైసీపీ ఎంపీల రాజీనామా పేరిట ఇరకాటంలో పెట్టాలని. స్టీల్ ప్లాంట్ ఢిల్లీ వారిది అయినా పాలిటిక్స్ లోకల్ గా చేయాలని.

వైసీపీకి ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారు కాబట్టే ఈ డిమాండ్ అంటున్నారు. అదే టీడీపీకి మూడు కాకుండ పది మంది ఉన్నా ఈ మాట అంటారా అని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఉక్కు పోరాటం ఇలా అవడానికి కారణం రాజకీయ పార్టీల మధ్య అనైక్యత ప్రధాన కారణం అని కార్మిక లోకం అంటోంది అంటే అనదు మరీ. 

టీడీపీవి అర్ధం లేని డిమాండ్లు అని వైసీపీ నేతలూ అంటున్నారు. సో ఉక్కు కధ కంచికి, రాజకీయం ముందుకీ అన్నట్లుగానే సీన్ ఉంది మరి.