భయపెడుతోన్న సముద్రం…?

సముద్రం…దాని లోతుపాతులు ఎవరికీ తెలియవు. అది గంభీరంగా ఉంటుంది. ఒక్కోసారి ప్రళయంగా మారుతుంది. ఇంకోసారి ప్రణయ రాగాలు వినిపిస్తుంది. ఏది ఏమైనా సముద్రం అంటే ఎదురుగా కనిపించే ప్రకృతి.  దానిదే అచ్చమైన ఆకృతి. Advertisement…

సముద్రం…దాని లోతుపాతులు ఎవరికీ తెలియవు. అది గంభీరంగా ఉంటుంది. ఒక్కోసారి ప్రళయంగా మారుతుంది. ఇంకోసారి ప్రణయ రాగాలు వినిపిస్తుంది. ఏది ఏమైనా సముద్రం అంటే ఎదురుగా కనిపించే ప్రకృతి.  దానిదే అచ్చమైన ఆకృతి.

ప్రకృతిలో ఎపుడు ఏం జరుగుగుతుందో ఎవరికీ తెలియదు. ఆహ్లాదకరమైన ఆనందాలను ఇచ్చే సాగరమే, అరవీర భయంకరంగానూ మారగలదు. విశాఖ బీచ్ అంటేనే అందరికీ వేడుక, అక్కడికి వెళ్తే అదో పెద్ద ముచ్చట. అలాంటిది జవాద్ తుపాను నేపధ్యంలో సాగర తీరం బాగానే అలజడినే రేపింది. హుదూద్ తరువాత అతి పెద్ద తుపాను విశాఖను తాకుతుందని అందరూ భావించారు, తెగ కలవరపడ్డారు.

అయితే దిశ మార్చుకున్న జవాద్ పెద్దగా ఇబ్బంది పెట్టకుండానే వెళ్లిపోయింది. కానీ జవాద్ తాలూకా సంకేతాలు మాత్రం విశాఖ బీచ్ ని బాగానే కలవరపెట్టాయి. జవాద్ తుపాను ప్రాభావంతో విశాఖ బీచ్ ఒక్కసారిగా ముందుకు వచ్చింది. కెరటాలు తీరాన్ని దాటి ఎగిసిపడ్డాయి. 

అంతే కాదు బీచ్ వద్ద ఉన్న చిన్నపిల్లల పార్కులో పది అడుగుల మేర కోతపడింది. ఈ దెబ్బకు బల్లకు, అక్కడ ఉన్న బొమ్మలు కూడా విరిగిపడ్డాయి. జవాద్ తుపాన్ కారణంగా రెండు వందల మీటర్ల మేర విశాఖ సాగరతీరం కోతకు గురి అయినట్లుగా అధికారులు గుర్తించారు.

విశాఖ బీచ్ ముందుకు రావడంతో బీచ్ కి వచ్చి ఎంజాయ్ చేయాలనుకున్న సందర్శకులు భయపడుతున్నారు. ఏం జరుగుతుందో ఆన్న ఆందోళన సర్వత్రా ఉంది. ఇదిలా ఉంటే సందర్శకులను ఎవరినీ ఆ వైపుగా రానీయకుండా ఆంక్షలు విధించారు, పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు.