Advertisement

Advertisement


Home > Movies - Movie News

రామ్ చరణ్-శంకర్ సినిమాకు బ్రేకులు?

రామ్ చరణ్-శంకర్ సినిమాకు బ్రేకులు?

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు బ్రేకులు పడ్డాయి. ఈ మూవీకి సంబంధించి 2 షెడ్యూల్స్ సక్సెస్ ఫుల్ గా పూర్తయ్యాయి. ఒక షెడ్యూల్ ను పూణెలో, మరో షెడ్యూల్ ను హైదరాబాద్ లో నిన్నటివరకు కొనసాగించారు. మూడో  షెడ్యూల్ పై ఇప్పుడు అనుమానాలు మొదలయ్యాయి.

తెరపైకి ఇండియన్-2

ఇండియన్-2 సినిమాను శంకర్ పూర్తిచేయాల్సి ఉంది. కోర్టు జోక్యంతో లైకా ప్రొడక్షన్స్ నిర్మాతలు, శంకర్ ఓ ఒప్పందానికి వచ్చిన విషయం తెలిసిందే. అయితే అంతలోనే కమల్ హాసన్ కరోనా బారిన పడ్డంతో ఇండియన్-2 మరోసారి ఆలస్యమైంది. 

కమల్ ఇప్పుడు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇండియన్-2కు కాల్షీట్లు కూడా కేటాయించారు. సో.. శంకర్ ఇప్పుడు ఆ సినిమాకు షిఫ్ట్ అవ్వాల్సి ఉంది.

ఆర్ఆర్ఆర్ ప్రచారం

ఇటు రామ్ చరణ్ కు కూడా మరోసారి ఆర్ఆర్ఆర్ పని పడింది. ఈ నెలలోనే ఈ సినిమా ప్రచారాన్ని ప్రారంభించాలి చరణ్. దీనికి సంబంధించి ఇప్పటికే రాజమౌళి యూనిట్ తో చర్చలు పూర్తయ్యాయి. చరణ్ డేట్స్ కూడా లాక్ అయ్యాయి. కాబట్టి కొన్నాళ్లు శంకర్ తో చేస్తున్న సినిమాను ఆపాల్సిందే.

రిలీజ్ డేట్ వాయిదా

ఈ రెండు కారణాల వల్ల రామ్ చరణ్-శంకర్ సినిమా విడుదల కాస్త ఆలస్యమయ్యేలా ఉంది. ఈ సినిమాను వచ్చే ఏడాది దసరాకు విడుదల చేయాలనేది ప్లాన్. కానీ ఆ టైమ్ కు మూవీ రెడీ అవ్వదనే అంచనాకు యూనిట్ వచ్చేసింది. 

మరోవైపు సినిమాలో కీలక పాత్ర పోషించాల్సిన ఓ స్టార్ హీరో ఎవరనేది కూడా ఇంకా డిసైడ్ అవ్వలేదు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆ కీలక పాత్రను, పవన్ తో చేయించాలని ప్రారంభంలో అనుకున్నప్పటికీ, పాన్-ఇండియా అప్పీల్ ఉండే మరో హీరో కోసం వెదుకుతున్నట్టు తెలుస్తోంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?