విశాఖ రాజధాని కావాలనే జనం తీర్పు

మూడు రాజధానులను చేస్తాం, అన్ని వర్గాలను న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. ఆ మేరకు చట్టాన్ని చేశారు. అయితే అది న్యాయస్థానంలో ఉంది. ఇంతలోనే జనం తీర్పు వచ్చేసింది. విశాఖ రాజధానిగా ప్రజలు…

మూడు రాజధానులను చేస్తాం, అన్ని వర్గాలను న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. ఆ మేరకు చట్టాన్ని చేశారు. అయితే అది న్యాయస్థానంలో ఉంది. ఇంతలోనే జనం తీర్పు వచ్చేసింది. విశాఖ రాజధానిగా ప్రజలు ఒప్పుకోవడంలేదని ఇప్పటిదాకా మాట్లాడిన తెలుగుదేశం అధినాయకులకు దిమ్మతిరిగే తీర్పుని విశాఖ జనం ఇచ్చారు.

విశాఖలో వైసీపీని గెలిపించడం  ద్వారా రాజధానికే ఓటేశారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. విశాఖవాసులు ఏం కోరుకుంటున్నారో స్పష్టంగా చెప్పారని కూడా ఆయన తెలిపారు.

అదే విధంగా ఉత్తరాంధ్రా వాసులంతా విశాఖ  రాజధాని ద్వారా జరిగే  అభివృద్ధి కావాలనే ఓటు వేసి మూడు జిల్లాల్లో తమ పార్టీకి క్లీన్ స్వీప్ తీర్పు ఇచ్చారని ఆయన చెప్పారు. మొత్తానికి ఈ తీర్పు తో విశాఖకు రాజధాని రావడం ఖాయమని కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు.

విశాఖను ఇక రాజధాని అని పిలవడం లాంచనం అన్నట్లుగానే మంత్రి కన్నబాబు సహా అంతా స్పష్టం చేశారు. ఏది ఏమైనా 2019 ఎన్నికల్లో విశాఖ రూరల్ జిల్లాలో వైసీపీ గెలిచినా  సిటీలో నాలుగు సీట్లూ కోల్పోయింది.

ఇపుడు గ్రేటర్ ఎన్నికల్లో గెలుపు ద్వారా వైసీపీ సిటీలో కూడా జెండా పాతినట్లు అయింది. అలాగే తన గెలుపును సంపూర్ణం చేసుకుంది.