విశాఖలో భూములున్నాయా…!?

హుదూద్ తుఫాన్ 2014లో విశాఖను ముంచేసింది. తీరానికి ఆనుకుని ఉన్న నగరం కావడంతో చిగురుటాకులా వణికిపోయింది. కొండలు ఉండబట్టి రాక్షల గాలులను తట్టుకుని నగరం నిలబడిందని అంటారు. హుదూద్ ని విశాఖ జనం ఒక…

హుదూద్ తుఫాన్ 2014లో విశాఖను ముంచేసింది. తీరానికి ఆనుకుని ఉన్న నగరం కావడంతో చిగురుటాకులా వణికిపోయింది. కొండలు ఉండబట్టి రాక్షల గాలులను తట్టుకుని నగరం నిలబడిందని అంటారు. హుదూద్ ని విశాఖ జనం ఒక శాపంగా పరిగణిస్తే  అప్పటి అధికార పార్టీకి చెందిన కొందరు పసుపు తమ్ముళ్ళు మాత్రం వరంగా భావించారు.

అంతే మొత్తం భూములను ఎక్కడికక్కడ చెరపట్టారు. ఇందులో ప్రభుత్వం, ప్రైవేట్, అసైన్డ్ భూములు అన్న తేడా లేదు, పేదలు, స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చిన  భూములు అన్న భేదం అంతకంటే లేదు.

భూములను యధేచ్చగా దోచుకుని ఆ పాపం మాత్రం హుదూద్ మీదకు నెట్టేశారు. హుదూద్ తుఫాన్ వల్ల మొత్తం భూముల రికార్డులన్నీ గల్లంతు అయ్యాయని తెలివిగా నాటి రెవిన్యూ అధికారుల చేత చెప్పించారు

హుదూద్ వల్ల చెట్లు కూలడం, విద్యుత్ స్థంభాలు  పడిపోవడం వంటివి మాత్రేమే జరిగాయి. కానీ ఒక్క భూముల రికార్డులు తప్ప  అంతా భద్రంగానే ఉందని అంటేనే నమ్మబుద్ధి కావడంలేదు

అప్పటికి సరిగ్గా ఆరునెలలు అయింది టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చి. అయినా సరే హుదూద్ పేరు చెప్పి భూమిని చాపలా చుట్టేసి పట్టేసే భూదందాలకు తెరలేచిపోయింది. ఏపీలోనే అతి పెద్ద భూ స్కాంగా ఇప్పటికీ అది ఉంది. వేలాది ఎకరాలు, వేల కోట్ల రూపాయల కుంభకోణం ఇది.

దీని మీద సిట్ విచారణ నాడు టీడీపీ హయాంలో జరిగింది, నివేదిక లేదు, నేడు వైసీపీ వచ్చాక మరో విచారణ జరుగుతోంది. ఇవన్నీ ఇలా ఉంటే విశాఖ రాజధాని కనుక వస్తే భూదందా జరుగుతుందట, మొత్తం భూములు పోతాయట. ఈ మాటలు అంటున్నది ఎమ్మెల్సీగా ఉన్న టీడీపీ నేత దువ్వారపు రామారావు, ఇక నాటి సొంత సర్కార్లోని సిట్ వేసినపుడే విచారణకు హాజరైన మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ సైతం రాజధాని వస్తే విశాఖ భూములన్నీ కొల్లగొడతారని అంటున్నారు.

నిజమే భూములు ఉంటే కొల్లగొట్టేవారో, ఏమైనా కట్టేవారో. అసలు భూములు ఎక్కడ ఉన్నాయి స్వామీ అంటున్నారు వైసీపీ నెతలు, మొత్తం కాజేశారుగా, భూ దందాల పేరిట నొక్కేశారుగా అంటూ రివర్స్ అటాక్ చేస్తున్నారు.

మొత్తానికి తమ్ముళ్ళ లాజిక్ భలేగా ఉంది. నాడు భూ దందాకు హుదూద్ పనికివచ్చింది. ఇపుడు రాజధానిని అడ్డుకోవడానికి ఇదే భూ దందా పనికివస్తోంది.