జగన్ ముందు చూపుతో తీసుకున్న సంచలన నిర్ణయం గ్రామ, వార్డు స్థాయిలలో వాలంటీర్ల వ్యవస్థ. ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో వారు చేస్తున్న సేవలకు అందరి ప్రశంసలు లభిస్తున్నాయి. కరోనా మహమ్మారి పెద్ద ఎత్తున విస్తరిస్తున్న వేళ వాలంటీర్లు ఎప్పటికపుడు సమాచారాన్ని సేకరించి ఉన్నత వర్గాలకు చేరవేయడంతో విజయవంతమైన పాత్ర పోషిస్తున్నారు.
ఓ విధంగా వీరంగా జగన్ టీంగా మారి జాతీయ స్థాయిలోనూ ఈ వ్యవస్థ కితాబులు అందుకుంటున్న పరిస్థితి ఉంది. దీని మీద తెలుగు తమ్ముళ్ళు మాత్రం ఇప్పటికీ నిప్పులే కురిపిస్తున్నారు. ఇదొక దండుగమారి వ్యవస్థ అని మాజీ మంత్రి, టీడీపీలో మేధావిగా ఉన్న యనమల రామక్రిష్ణుడు అంటూనే ఉన్నారు.
దీని మీద సీపీఎం పార్టీ మాత్రం భిన్నంగా స్పందిస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు సీహెచ్ నరసింగరావు గ్రామ వాలంటీర్లు అధ్బుతంగా పనిచేస్తున్నారని పొగడ్తలు కురిపించారు. గ్రామ స్థాయిలో వారు చేస్తున్న సేవలు ఎన్నదగినవని, వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఈ రోజు కరోనా కట్టడికి వారు ముందుండి చేస్తున్న కార్యక్రమాలు బహు గొప్పవి అని కూడా అంటున్నారు.
వాలంటీర్ల విషయంలో ఎవరు తప్పుగా మాట్లాడినా అది ఖండించాల్సిందేనని కూడా ఆయన అంటున్నారు. మొత్తానికి తీసుకుంటే సీపీఎం పెద్దలు కూడా ఇది మంచి వ్యవస్థ అని గుర్తిస్తున్నా టీడీపీకి, దానికి వంత పాడే ఇతర పార్టీలకు మాత్రం అర్ధం కావడంలేదు. వారికి రాజకీయమే ముఖ్యమైపోయింది మరి.