కొడుకు మీద ఆశలు వదిలేసుకున్నాం….

మానవ సంబంధాలు చిత్రమైనవి. ఎంత ఆధునిక యుగంలో ఉన్నా కూడా ఆ బంధాల గట్టితనం అలాగే ఉంది. ఎదిగి వచ్చిన కొడుకు చిన్న విషయం మీద కన్న వారితో గొడవ పడి నాలుగేళ్ల క్రితం…

మానవ సంబంధాలు చిత్రమైనవి. ఎంత ఆధునిక యుగంలో ఉన్నా కూడా ఆ బంధాల గట్టితనం అలాగే ఉంది. ఎదిగి వచ్చిన కొడుకు చిన్న విషయం మీద కన్న వారితో గొడవ పడి నాలుగేళ్ల క్రితం ఇల్లు దాటేశాడు. ఆ మీదట రెండేళ్ళుగా పాకిస్థాన్ చెరలో బంధీగా ఉన్నాడు. ప్రస్తుతం పాక్ ఇండియాల మధ్య సంబంధాలు అంతగా బాగులేవు.

దాంతో తమ కుమారుడు ఇక దక్కడని ఆశలు వదిలేసుకున్నామని ప్రశాంత్ తండ్రి బాబూరావు బాధాతప్త హృదయంతో చెప్పుకొచ్చారు. 2019 లో పాక్ బోర్డర్ లోకి వెళ్ళి అక్కడ దాయాది దేశానికి బంధీగా చిక్కిన విశాఖ వాసి ప్రశాంత్ ఎట్టకేలకు అన్నీ చెరలూ విడిపించుకుని ఈ రోజుకు విశాఖలోని తన ఇంటికి సేఫ్ గా చేరుకున్నాడు.

విశాఖలోని మధురవాడలో నివాసం ఉంటున్న ప్రశాంత్ తల్లిదండ్రులు ఇది కలయా నిజమా అన్నది అసలు నమ్మలేకపోతున్నారుట. తమ కుమారుడు క్షేమంగా తిరిగి రావాలని ఒక వైపు ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు ఇంతదాకా. అయితే ఒక దశలో ప్రయత్నాలు అన్నీ అయిపోయి ఆశలు వదిలేసుకున్నారుట.

తమ కొడుకు దక్కడేమోనని గుండె రాయి చేసుకున్న సందర్భాలు ఉన్నాయని బాబూరావు చెప్పారు. అయితే ఏపీ తెలంగాణా ప్రభుత్వాలు సక్రమంగా స్పందించి తమ బిడ్డను తమ దగ్గరకు చేర్చాయని బాబూరావు ధన్యవాదాలు తెలియచేస్తున్నారు. అలాగే భారత ప్రభుత్వానికి కూడా ఆయన ధన్య‌వాదాలు తెలిపారు.

ఈ మొత్తం కృషిలో సహయత అనే స్వచ్ఛంద సంస్థ ఎంతో సహయం అందించిందని ఆయన చెప్పారు. మొత్తానికి ప్రశాంత్ రావడంతో విశాఖలోని అపార్ట్ మెంట్ ఏరియా అంతటా పండుగ వాతావరణమే నెలకొంది. ప్రశాంత్ కధ ఒక విధంగా సినిమానే తలపించిందని అంటున్నారు అంతా.