యనమల మాన‌సిక స్థితి ఎందుకిలా?

ఏపీలో ప్ర‌జ‌లతో ఏ మాత్రం సంబంధం లేని నాయ‌కుడెవ‌రైనా ఉన్నారా అంటే…ఇద్ద‌రు పేర్లు చెప్పుకోవాల్సి ఉంటుంది. వాళ్లిద్ద‌రూ..య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, నారా లోకేశ్‌. ప్ర‌జ‌ల తిర‌స్క‌ర‌ణ‌కు గురైన య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు నామినేటెడ్ ప‌ద‌వుల్లో కొన‌సాగుతూ…తెలివి త‌న‌కు…

ఏపీలో ప్ర‌జ‌లతో ఏ మాత్రం సంబంధం లేని నాయ‌కుడెవ‌రైనా ఉన్నారా అంటే…ఇద్ద‌రు పేర్లు చెప్పుకోవాల్సి ఉంటుంది. వాళ్లిద్ద‌రూ..య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, నారా లోకేశ్‌. ప్ర‌జ‌ల తిర‌స్క‌ర‌ణ‌కు గురైన య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు నామినేటెడ్ ప‌ద‌వుల్లో కొన‌సాగుతూ…తెలివి త‌న‌కు మాత్ర‌మే సొంత‌మ‌నే అహంకారంతో విర్ర‌వీగుతుంటాడు. పంచ్ డైలాగ్‌లు, ప‌స‌లేని విమ‌ర్శ‌ల‌తో నిత్యం మీడియాలో ఉండ‌టానికి య‌న‌మ‌ల త‌హ‌త‌హ‌లాడుతుంటాడు. అయితే తాజాగా ఆయ‌న మాట‌లు వింటుంటే య‌న‌మ‌ల మాన‌సిక స్థితిపై ఆందోళ‌న క‌లుగుతోంది.

తాజాగా అలాంటి విమ‌ర్శ‌ల‌నే జ‌గ‌న్ స‌ర్కార్‌పై మాజీ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు చేశాడు. జ‌గ‌న్ స‌ర్కార్ తీరువ‌ల్లే ఏపీలో క‌రోనా విజృంభిస్తోంద‌ని ఆయ‌న విమ‌ర్శ‌లు చేశాడు. ఏపీలో మొద‌టి కేసు న‌మోదైనప్ప‌టి నుంచి రాజ‌కీయాల‌కే ప్రాధాన్యం ఇస్తూ, క‌రోనా తీవ్ర‌త‌ను ప‌ట్టించుకోలేద‌ని ఆయ‌న ఆరోపించాడు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికీ కట్టడి చేసే పరిస్థితి లేదని… పరీక్షలు చేసే పరిస్థితి అంతకంటే లేదని ఆయ‌న విమ‌ర్శ‌లు చేశాడు. దీన్నిబ‌ట్టి ఆయ‌న మాన‌సిక స్థితిని జ‌నం అంచ‌నా వేసుకోవ‌చ్చు. ఏదో ఒక‌టి మాట్లాడాల‌నే త‌ప‌న త‌ప్ప‌, ఏం మాట్లాడుతున్నారో ఆయ‌న‌కే తెలిసిన‌ట్టు లేదు.  పొరుగు రాష్ట్రాలు కరోనాను అరికట్టడంలో చిత్తశుద్ధి చూపాయి కాబట్టే కేసులు పెరగలేదంటున్న య‌న‌మ‌ల‌…ఏ రాష్ట్రంలో లేవో చెబితే మంచిది.  

రాష్ట్ర ఆదాయం బానే ఉందని, కేంద్ర సాయమూ అందుతోందని, అయితే నిధుల్ని మాత్రం కరోనా కట్టడికి కాకుండా తన కాంట్రాక్టర్లకు మళ్లిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని య‌న‌మ‌ల ఆరోపించాడు. సుదీర్ఘ కాలం పాటు ఆర్థిక మంత్రిగా ప‌నిచేసిన య‌న‌మ‌ల మాట్లాడాల్సిన మాట‌లేనా ఇవి? మ‌రి జ‌గ‌న్ ఆలోచ‌న‌లు బాగా లేక‌పోతే, రాష్ట్ర ఆదాయ ప‌రిస్థితి ఎలా బాగుంటుందో ఆయ‌న సెల‌విస్తే మంచిది.  క‌రోనాతో వ్య‌వ‌స్థ మొత్తం స్తంభించి ఆర్థిక ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారిన విష‌యం చిన్న పిల్ల‌ల్ని అడిగిన చెబుతారు.  య‌న‌మ‌ల మాట‌లు వింటుంటే ఆయ‌న మాన‌సిక స్థితిపై త‌ప్ప‌క ఆందోళ‌న చెందాల్సి వ‌స్తోంది. పాపం…క‌రోనా ఎలాంటి నాయ‌కుడిని ఎలాంటి దుస్థితికి తీసుకొచ్చిందో క‌దా!

కన్నా బీజేపీకి మాత్రం కన్నం వెయ్యకు