ఐదేళ్లు ఏం చేశావు బాబూ.. నిలదీసిన జగన్

అడిగినా అడక్కపోయినా అమరావతిపై తనకున్న ప్రేమను పదే పదే చెప్పుకుంటుంటారు చంద్రబాబు. రాజధాని ప్రాంతాన్ని తాను ఎలా అభివృద్ధి చేయాలనుకున్న విషయంపై జూమ్ లో లెక్చర్లు దంచుతుంటారు. అమరావతి అభివృద్ధి అంతా గ్రాఫిక్స్ అంటే…

అడిగినా అడక్కపోయినా అమరావతిపై తనకున్న ప్రేమను పదే పదే చెప్పుకుంటుంటారు చంద్రబాబు. రాజధాని ప్రాంతాన్ని తాను ఎలా అభివృద్ధి చేయాలనుకున్న విషయంపై జూమ్ లో లెక్చర్లు దంచుతుంటారు. అమరావతి అభివృద్ధి అంతా గ్రాఫిక్స్ అంటే మాత్రం బాబుతో సహా టీడీపీ నాయకులెరూ ఒప్పుకోరు. పోనీ గ్రాఫిక్స్ కాకుండా ఏం చేశారయ్యా అంటే మేం చేసే లోపే మీకు ప్రజలు అధికారమిచ్చారంటూ నెపం జనంపై నెట్టేస్తారు.

అసలు చంద్రబాబు అమరావతి ప్రాంతానికి ఏమీ చేయలేదని, చేసే ఉద్దేశం కూడా ఆయనకు లేదని పలు సందర్భాల్లో నిరూపితమైంది. తాజాగా వైఎస్సార్ వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రారంభోత్సవం సందర్భంగా పరోక్షంగా చంద్రబాబు అసమర్థతను ఎత్తి చూపారు జగన్. రాజధాని జిల్లాల్లోని జగ్గయ్యపేట మున్సిపాల్టీ.. ఇతర 30 గ్రామాలకు తాగునీరు అందించే ప్రధాన ఉద్దేశంతో  ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రారంభిస్తున్నట్టు చెప్పారు జగన్.

తాము అధికారం చేపట్టిన 14 నెలల్లోనే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కి శంకుస్థాపన చేశామని, 2021 ఫిబ్రవరి కల్లా దీన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఏ పథకానికైనా డెడ్ లైన్ పెట్టి మరీ పూర్తి చేయడం జగన్ ఆనవాయితీ. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్ని కూడా అదే స్పీడ్ లో పూర్తి చేయబోతున్నామని ముందే హింట్ ఇచ్చారు సీఎం. ఈ ప్రాజెక్ట్ తో ఎత్తిపోసే 2.7 టీఎంసీల నీటితో 38,627 ఎకరాలకు సాగునీరు కూడా అందుతుంది. మొత్తం ప్రాజెక్ట్ వ్యయం 490 కోట్ల రూపాయలు.

అభివృద్ధి మాది, విధ్వంసం మీది అని చెప్పుకునే చంద్రబాబుకి ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టి పూర్తిచేయాలనే ఆలోచన ఎందుకు రాలేదు. కనీసం తాను కోరుకుంటున్న గుంటూరు, కృష్ణా జిల్లాలనైనా ఆయన అభివృద్ధి చేసి ఉండొచ్చు కదా. ఐదేళ్లలో గత ప్రభుత్వం ఇలాంటి పథకాలన్నిటినీ గాలికొదిలేసిందని అన్నారు సీఎం జగన్.

కేవలం అమరావతి గ్రాఫిక్స్ తో కుస్తీ పట్టిన చంద్రబాబు ఐదేళ్ల కాలంలో మిగతా ప్రాంతాలన్నిటినీ పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. కనీసం ఒక్క పథకాన్ని కూడా పూర్తి చేయకుండానే ఐదేళ్లు కాలం గడిపేశారు. ఇప్పుడు జగన్ అధికారం చేపట్టిన వెంటనే అన్నిటినీ సరిదిద్దుకుంటూ వస్తున్నారు. కొత్త పథకాలతో ప్రజలకు మరింత చేరువవుతున్నారు.