బాబుకి దూరంగా నారాయణ.. అసలు కారణం ఏంటి?

చంద్రబాబు హయాంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఓ వెలుగు వెలిగారు నారాయణ. అప్పటి వరకూ విద్యాసంస్థల అధినేతగా, టీడీపీకి ఆర్థిక అవసరాలు తీర్చే వ్యాపారవేత్తగా పేరున్న నారాయణ.. బాబు ముఖ్యమంత్రి కాగానే టీడీపీలో చక్రం…

చంద్రబాబు హయాంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఓ వెలుగు వెలిగారు నారాయణ. అప్పటి వరకూ విద్యాసంస్థల అధినేతగా, టీడీపీకి ఆర్థిక అవసరాలు తీర్చే వ్యాపారవేత్తగా పేరున్న నారాయణ.. బాబు ముఖ్యమంత్రి కాగానే టీడీపీలో చక్రం తిప్పారు. అమరావతి రాజధాని విషయంలో కూడా ఆయన మాటే చెల్లుబాటు అయింది. సీఆర్డీఏ వ్యవహారాలన్నీ అన్నీ తానై నడిపారు.

అలాంటి నారాయణ.. ఎమ్మెల్సీ పదవి ఉన్నా కూడా అతి నమ్మకంతో గత ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. కోట్లకు కోట్లు నోట్లు కుమ్మరించినా కూడా ఫలితం లేకపోయింది. అప్పటినుంచి నారాయణ పూర్తిగా తెరమరుగయ్యారు. టీడీపీ కార్యక్రమాలకు ఆయన పూర్తిగా దూరమయ్యారు. కనీసం సొంత ఊరు నెల్లూరులో కూడా ఏ ఒక్క కార్యక్రమానికీ ఆయన రావడంలేదు.

అంతమాత్రాన పార్టీకి, చంద్రబాబుకి ఆయన దూరమయ్యారా అంటే అదీ లేదు. కేవలం వైసీపీకి టార్గెట్ కాకూడదు అనే ఉద్దేశంతోనే ఆయన టీడీపీకి దూరంగా ఉన్నారని తెలుస్తోంది. వాస్తవానికి చంద్రబాబు, నారాయణ పలు కాంట్రాక్టులు, వ్యాపారాల్లో రహస్య భాగస్వాములు. అమరావతి భూముల వ్యవహారంలో కూడా ఇద్దరికీ చాలా లావాదేవీలున్నాయి. దీంతో ఆయన బాబుని, చినబాబుని వదిలిపెట్టి పోయే పరిస్థితి లేదు అని తెలిసినవారంటున్నారు.

ఇక నారాయణ ఇప్పుడేం చేస్తున్నారంటే.. తన విద్యాసంస్థలను గాడిలో పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పోటీ సంస్థ శ్రీచైతన్యతో కలసి అప్పట్లో 'చైనా' బ్యాచ్ (చైతన్య-నారాయణ) నడిపినా.. ఆ తర్వాత విభేదాలు రావడంతో నారాయణ హవా కాస్త తగ్గింది. 2019 ఎన్నికల తర్వాత పూర్తిగా వ్యాపారాలకే పరిమితమైన నారాయణ, రాజకీయ నాయుకులెవర్నీ తన దగ్గరకు రానీయడంలేదు, రాజకీయాలు మాట్లాడ్డం కూడా తగ్గించేశారు. కేవలం నెల్లూరు రాజకీయాల్లో తన మనుషులకు ముఖ్య పదవులు వచ్చేలా జాగ్రత్తపడ్డారంతే.

ఇక చంద్రబాబుతో కూడా ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటారు నారాయణ. అయితే ఇవన్నీ సీక్రెట్ గా జరిగిపోతుండటంతో.. వైసీపీ నేతలు కూడా ఆయన్ను పెద్దగా టార్గెట్ చేయలేదు. మిగతా సీనియర్ నాయకులంతా జగన్ ని తిడుతూ.. వైసీపీ వాళ్లకు, వైసీపీ మీడియాకు టార్గెట్ అవుతుంటే.. నారాయణ మాత్రం తన పని తాను చూసుకుంటున్నారు.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్నీ తానై నడిపిన ఆయన, ఇప్పుడు ప్రతిపక్షంలో మాత్రం పూర్తిగా సైలెంట్ కావడం విచిత్రమే. రాగా పోగా.. ఆయన వియ్యంకుడు గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వెళ్తే, నారాయణకు ఇంకా హ్యాపీ. వైసీపీ నుంచి ఇక ఆయనకు ఎలాంటి భయం ఉండదు. అందుకే నారాయణ అజ్ఞాతంలో ఉన్నారు. అదను కోసం ఎదురుచూస్తున్నారు.

దేశం దృష్టిలో ఇప్పుడు జగన్ ఒక హీరో