ఏపీ సీబీసీఐడీలో అర్జునుడెవ్వరు?

కౌరవులకు, పాండవులకు సకల విద్యలూ నేర్పించే సమయంలో గురువు ద్రోణాచార్యులవారు తన శిష్యులను వెంటబెట్టుకుని ఓ చెట్టు దగ్గరకి తీసుకెళ్ళారు.  Advertisement ఆ చెట్టువైపు చూపించి “మీకు ఏం కనిపిస్తోంది” అని శిష్యులను ప్రశ్నించారు…

కౌరవులకు, పాండవులకు సకల విద్యలూ నేర్పించే సమయంలో గురువు ద్రోణాచార్యులవారు తన శిష్యులను వెంటబెట్టుకుని ఓ చెట్టు దగ్గరకి తీసుకెళ్ళారు. 

ఆ చెట్టువైపు చూపించి “మీకు ఏం కనిపిస్తోంది” అని శిష్యులను ప్రశ్నించారు ద్రోణాచార్యులవారు. 

కొందరు “చెట్టు కనిపిస్తోంది” అన్నారు. ఇంకొందరు “కాయలు కనిపిస్తున్నాయి” అన్నారు. ఒకరో, ఇద్దరో “చెట్టుకొమ్మపై ఓ పిట్ట కనిపిస్తోంది” అన్నారు. 

చివరిగా అర్జునుడు మాత్రం “చెట్టు కొమ్మపై కూర్చున్న పిట్ట ఎడమ కన్ను కనిపిస్తోంది” అని చెప్పాడంట. అర్జునుడిది అంతటి సూక్ష్మ ద్రుష్టి అనేవారు. 

ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ సీబీసీఐడీ లో ఎవరో అలాంటివారు ఉన్నట్టున్నారు. లేకపోతే మొత్తం ఆ భారీ మనిషిని వదిలేసి ఎడమకాలి రెండో వేలు ఎలా చూడగలిగాడు? చూసినాడుపో, ఆ వేలు కొన మాత్రమే ఎలా గాయపర్చగలిగాడు? 

ఇంతకూ ఎవరా అపర అర్జనుడు?

Facebook post by Gopi Dara