బీజేపీ అభ్యర్థి ఎవరో తెలిసింది….టీఆర్ఎస్ బ్లాస్ట్ చేస్తుందా ?

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ఒక్క టీఆర్ఎస్ మినహాయించి  ఏ పార్టీ తరపున ఎవరు పోటీ చేస్తున్నారో జనాలకు క్లారిటీ వచ్చింది. నామినేషన్లు వేయడానికి ఒక్కరోజే మిగిలివుంది కాబట్టి ఈరోజో, రేపో గులాబీ పార్టీ…

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ఒక్క టీఆర్ఎస్ మినహాయించి  ఏ పార్టీ తరపున ఎవరు పోటీ చేస్తున్నారో జనాలకు క్లారిటీ వచ్చింది. నామినేషన్లు వేయడానికి ఒక్కరోజే మిగిలివుంది కాబట్టి ఈరోజో, రేపో గులాబీ పార్టీ తన అభ్యర్థి పేరును ప్రకటించాల్సి ఉంది. అందరికంటే కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా జానా రెడ్డిని ఎంపిక చేసింది. ఆయన తన గెలుపు కోసం టీపీసీసీ అధ్యక్ష పదవిని కూడా ప్రకటించకుండా చేశాడు.

ఇక బీజేపీ, టీఆర్ఎస్ ఇంతకాలం తమ అభ్యర్థులను ప్రటించకపోవడానికి కారణం ఎవరు ముందు ప్రకటిస్తే వాళ్ళ అభ్యర్థిని వాళ్ళ అభ్యర్థిని చూసి వీళ్ళు ప్రకటించాలని పోటీబడి ఇన్నిరోజులు వెయిట్ చేశారు. అభ్యర్థుల ఎంపికకు ప్రధానంగా కులాన్ని ప్రాతిపదికగా తీసుకుంటారు. ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లుగా అవతలి పార్టీ ఏ కులం అభ్యర్థిని వీళ్ళు అదే కులం అభ్యర్థిని నిలబెడతారు. ఇలాంటి లెక్కలకోసమే బీజేపీ, టీఆర్ఎస్ వెయిట్ చేశాయి. ఇక చివరి క్షణంలో బీజేపీ నివేదితా రెడ్డి పేరు ప్రకటించింది.

వాస్తవానికి ఈమె పేరు ఎప్పటినుంచో ప్రచారంలో ఉంది. గత ఎన్నికల్లో ఈమె బీజేపీ తరపున పోటీచేసి ఓడిపోయింది. పార్టీ తనకే టిక్కెట్ ఇస్తుందనే నమ్మకంతో ఈమె అనధికారికంగా ప్రచారం చేసుకుంటూనే ఉంది. కానీ బీజేపీ, టీఆర్ఎస్ నిర్ణయం కోసం ఇంతకాలం ఎదురు చూసింది. సేమ్ టీఆర్ఎస్స్ పరిస్థితి కూడా ఇదే. సాధారణంగా ఇలా మరణం కారణంగా ఉపఎన్నికలు వచ్చినప్పుడు అధికారపార్టీ సానుభూతి మీద ఆధారపడుతుంది. 

అందుకే మరణించిన ఎమ్మెల్యే కుటుంబం నుంచే ఎవరో ఒకరిని ఎంపిక చేస్తారు. కానీ దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ కు ఈ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవలేదు. అందుకే సాగర్ లో ఆ ప్రయోగం చేయలేదు. నరసింహయ్య పాపులర్ నాయకుడు కాబట్టి ఆయన కుటుంబంలోనుంచే ఎవరికైనా టిక్కెట్ ఇవ్వొచ్చు. 

అలా ఇచ్చి ఉంటే ఇంతకాలం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండకపోయేది. కానీ బీజేపీ చేతిలో ఓడిపోతామేమోననే భయం కేసీఆర్ కు ఉంది. అందుకే బీజేపీ అభ్యర్థి ప్రకటన కోసం ఎదురు చూసింది. సో …ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డి. బీజేపీ అభ్యర్థి రెడ్డి. మరి టీఆర్ఎస్ కూడా రెడ్డినే బరిలోకి దింపుతుందేమో. 

ఏప్రిల్ 17 న జరిగే నాగార్జున సాగర్ నియోజకవర్గ అసెంబ్లీ ఉపఎన్నిక వేడి రాజుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో తెలిస్తే ఈ వేడి తారాస్థాయికి చేరుకుంటుంది.  విజయం సాధించడమే లక్ష్యంగా అన్ని ప్రధాన పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. సాగర్ పీఠాన్ని  తామే దక్కించుకోవాలని టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. దుబ్బాక మాదిరే సాగర్‌లోనూ టీఆర్ఎస్‌కు షాక్ ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది. ఈసారి ఎలాగైనా గెలిచి పూర్వ వైభవం సాధించాలని కాంగ్రెస్ భావిస్తోంది.

ఇక్కడ జానారెడ్డి  ముందు నుంచీ ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే, వైసీపీ అభ్యర్థి కూడా నామినేషన్ వేయడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అత్యధికంగా స్వతంత్ర అభ్యర్థులు కాగా. వైసీపీ అభ్యర్థి కూడా ఉండటం చర్చనీయాంశమైంది.  సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్య కొన్నేళ్లుగా స్నేహ బంధం కొనసాగుతోంది. తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా నేరుగా పోటీ చేకుండా.. వైసీపీ మద్దతు ఇస్తోందన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది.

కానీ అనూహ్యంగా సాగర్ ఉపఎన్నికల్లో వైసీసీ అభ్యర్థి నామినేషన్ వేయడం ఆసక్తికరంగా ఉంది. టీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చేందుకే వైసీపీ ఈ నిర్ణయం తీసుకుందని కొందరు నేతలు చెబితే.. ఓట్లను చీల్చి ప్రభుత్వానికి లబ్ధి చేకూర్చేందుకు పొలిటికల్ గేమ్ ఆడుతున్నారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదిలావుంటే, సాగర్ ఉపఎన్నికల్లో 400 మంది అమరవీరుల కుటుంబ సభ్యులు నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు.

అమవీరుల ప్రాణ త్యాగాల వల్లే తెలంగాణ వచ్చిందని.. కానీ స్వరాష్ట్రం వచ్చి ఏడేళ్లు గడుస్తున్నా వారి కుటుంబాలను సీఎం కేసీఆర్ ఆదుకోలేదని తెలంగాణ అమరువీరుల ఫోరం మండిపడింది. కేసీఆర్‌ తీరుకు నిరసనగా సాగర్‌లో నామినేషన్ వేస్తున్నట్లు వెల్లడించింది. 

తెలంగాణ వచ్చాక అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షల సాయం, ప్రభుత్వ ఉద్యోగం, ఐదెకరాల భూమి ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని.. కానీ ఇప్పటిదాకా కుటుంబాలకు ఒక్క రూపాయి ఆర్థిక సాయం కూడా  చేయలేదని అమరవీరుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.