సీటీమార్ వాయిదా

గోపీచంద్-తమన్నా-సంపత్ నంది కాంబినేషన్ చిట్టూరి శ్రీనివాసరావు నిర్మించిన సినిమా సిటీ మార్. కాస్త ఎక్కువ బడ్జెట్ తో భారీగా నిర్మించిన ఈ సినిమాను ఏప్రిల్ 2న విడుదల చేయాలని ఎప్పుడో డిసైడ్ చేసారు.  Advertisement…

గోపీచంద్-తమన్నా-సంపత్ నంది కాంబినేషన్ చిట్టూరి శ్రీనివాసరావు నిర్మించిన సినిమా సిటీ మార్. కాస్త ఎక్కువ బడ్జెట్ తో భారీగా నిర్మించిన ఈ సినిమాను ఏప్రిల్ 2న విడుదల చేయాలని ఎప్పుడో డిసైడ్ చేసారు. 

నాగ్ వైల్డ్ డాగ్, కార్తీ సుల్తాన్ కూడా ఇదే డేట్ కు అనౌన్స్ చేసినా కూడా అదే డేట్ కు రావాలనుకున్నారు. పవర్ స్టార్ వకీల్ సాబ్ మరో వారంలో వుందని తెలిసీ అలాగే స్టబర్న్ గా వున్నారు. సిజి వర్క్ లు అలా వుంచి సెన్సారు కూడా చేయించేసారు.

కానీ ఇప్పుడు ఆ సిజి వర్క్ లే ఆలస్యం అయిపోయేలా వున్నాయి. క్లయిమాక్స్ ఫైట్ సిజి ఫుటేజ్ లు రావడానికి ఇంకో మూడు రోజులు పడుతుందని బోగట్టా. సినిమా విడుదల చూస్తే వారంలో వుంది. ఈ హడావుడిలో పడి ప్రమోషన్ కూడా సరిగ్గా చేయలేదు. దీంతో ఇప్పుడు తప్పని సరిగా సినిమాను వాయిదా వేసేసారు. 

అయితే కొత్త డేట్ ఏమిటన్నది ఇంకా ఫిక్స్ చేసుకోలేదు. విరాటపర్వం వస్తున్న ఏప్రిల్ 30 లేదా దాని తరువాత వారం రావాలని ఆలోచన. కానీ అక్కడ కూడా మళ్లీ వారం ఆగితే మెగాస్టార్ ఆచార్య విడుదల వుంది. అందుకే విరాటపర్వం తో పాటే విడుదల చేయాలని డిసైడ్ అయ్యేలా వున్నారు నిర్మాత.