జగన్ లేఖ తర్వాత బాబు పరార్.. కారణం ఇదేనా?

కొడుకు లోకేష్ ని జనంపై రుద్దేందుకు మంచి ప్లానే వేశారు చంద్రబాబు. అంత మాత్రాన ఆయన తెరవెనక్కు వెళ్లిపోవడం ఎందుకు? అసలు విజయవాడ వచ్చిన తర్వాత చంద్రబాబు ఒక్కసారైనా బైట కనిపించారా? కేవలం వీడియో…

కొడుకు లోకేష్ ని జనంపై రుద్దేందుకు మంచి ప్లానే వేశారు చంద్రబాబు. అంత మాత్రాన ఆయన తెరవెనక్కు వెళ్లిపోవడం ఎందుకు? అసలు విజయవాడ వచ్చిన తర్వాత చంద్రబాబు ఒక్కసారైనా బైట కనిపించారా? కేవలం వీడియో కాన్ఫరెన్స్ లు అంటూ టీడీపీ బ్యాచ్ కి మాత్రమే కనిపిస్తున్నారు, వినిపిస్తున్నారు. 

ఈనాడు, జ్యోతిలో వార్తలు చూస్తే కాని.. చంద్రబాబు అనే మనిషి ఉన్నట్టు జనాలకి తెలియడంలేదు. అది కూడా పాత ఫొటోలతోనే తప్ప కొత్త క్లిక్కులు లేవు. ఇక ట్విట్టర్లో కూడా పుట్టినరోజులు, జయంతులు అంటూ హడావిడి చేస్తున్నారే తప్ప పైకి కనిపించడం లేదు..

అసలింతకీ బాబు ఏమయ్యారు? దీనికో ఆసక్తికర సమాధానం చెబుతున్నారు వైసీపీ నేతలు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సీఎం జగన్ లేఖ రాసిన రోజు నుంచి చంద్రబాబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని అంటున్నారు వైసీపీ నేతలు. సరిగ్గా జగన్ లేఖ రాసిన రోజు నుంచి బాబు కనిపించడం లేదని… ఇంతకీ చంద్రబాబు ఎక్కడున్నారు, ఏ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు.

వైసీపీ నేతలు సెటైర్ల కోసం ఈ టాపిక్ ఎత్తుకున్నప్పటికీ లాజికల్ గా ఆలోచిస్తే ఇందులో వాస్తవం బోధపడుతుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి జగన్ రాసిన లేఖపై బాబు కాస్త తీవ్రంగానే ఆలోచిస్తున్నారు. ఇన్నాళ్లూ ఎన్నో వ్యవస్థల్ని మేనేజ్ చేసి, వైసీపీ సర్కార్ ను ఇబ్బందులకు గురిచేస్తున్న బాబు.. ఇప్పుడా వ్యవస్థల్లోని తన వ్యక్తుల్ని కాపాడుకునే పనిలో పడ్డారు.

ఎన్నికల కమిషనర్ విషయంలో ఇబ్బందులు వస్తే.. కోర్టుల ద్వారా దాన్ని చక్కదిద్దుకున్నారు. కోర్టు ఆదేశాలతో తిరిగి తన మనిషినే ఏపీ ఎన్నికల కమిషనర్ గా తెచ్చుకున్నారు. కోర్టుల ద్వారా డాక్టర్లను కాపాడుకున్నారు, ఇంటెలిజెన్స్ చీఫ్ ని కాపాడే ప్రయత్నం చేశారు. ఇలా రకరకాల మార్గాల్లో తన పనులు చేయించుకున్నారు. ఇప్పుడు ఏకంగా న్యాయమూర్తిపైనే ఆరోపణలొచ్చాయి. దీంతో బాబు మరోసారి రంగంలోగి దిగారు.

న్యాయవ్యవస్థలోని మరికొందర్ని వాడుకుంటూ.. జగన్ పైనే పిటిషన్లు వేయిస్తున్నారు. తనకి అనుకూలంగా ఉన్నవారితో జగన్ కి వ్యతిరేకంగా మాట్లాడిస్తూ.. తన అను'కుల' మీడియాలో దాన్ని హైలెట్ చేయిస్తూ.. రకరకాల విన్యాసాలు ప్రదర్శిస్తున్నారు. ఈ కార్యక్రమాలతో బిజీగా ఉండటం వల్లే చంద్రబాబు బైటకు రాలేకపోతున్నారు. 

తూతూ మంత్రంగా వీడియో కాన్ఫరెన్స్ లు పెట్టి, మిగతా సమయం మొత్తం దీనిపైనే ఫోకస్ పెడుతున్నారట. ఎలాగూ బాబుకు ప్రజలు అక్కర్లేదు. వివిధ వ్యవస్థల్లో ఆయన పెంచి పోషించిన మనుషులు బాగుంటే చాలు.

మొత్తానికి జగన్ లేఖకు, బాబు అజ్ఞాతవాసానికి లింకు దొరికింది. ఆ లేఖ బైటకొచ్చాక చంద్రబాబు బైట కనిపించకపోవడం ఈ అనుమానాలను మరింత బలపరుస్తోంది.

దేశం దృష్టిలో ఇప్పుడు జగన్ ఒక హీరో