జాతీయ నాయకుడి నోరు ఏమైందో ?

చంద్రబాబు టీడీపీ ఎక్కడ బతికి ఉంది అంటే చెప్పడం బహుశా తమ్ముళ్ళకే కష్టం. మాది జాతీయ పార్టీ అని బయటకు ఆర్భాటంగా చెప్పుకుంటారు కానీ పక్కన ఉన్న తెలంగాణాలో ఆ పార్టీ లేదు. ఇపుడు…

చంద్రబాబు టీడీపీ ఎక్కడ బతికి ఉంది అంటే చెప్పడం బహుశా తమ్ముళ్ళకే కష్టం. మాది జాతీయ పార్టీ అని బయటకు ఆర్భాటంగా చెప్పుకుంటారు కానీ పక్కన ఉన్న తెలంగాణాలో ఆ పార్టీ లేదు. ఇపుడు చూస్తే ఏపీలో కూడా రాయలసీమ, ఉత్తరాంధ్రాలో జీరో అయింది.

ఈ నేపధ్యంలో బాబు చేస్తున్న యాత్రలను సైతం జనం అడ్డుకుంటున్నారు. ఇవన్నీ నిజాలు. వీటి మీద తమ్ముళ్ళు మాట్లాడకుండా జాతీయ నాయకుడు, ఢిల్లీలో చక్రం తిప్పిన మహా నేత అంటూ బాబుకు భుజ కీర్తులు తగిలించి మాట్లాడుతూంటారు.

సరిగ్గా దానిమీద సెటైర్లు వేశారు వైసీపీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు. జాతీయ నాయకుడివైతే ఈ చిల్లర రాజకీయమేంటి బాబూ అని నిలదీశారు. ఒక్క అమరావతి ప్రాంతం బాగుపడితే చాలు అనుకునే బాబు జాతీయ భావం మరీ ఇంత దారుణమా అని ఎద్దేవా చేశారు.

ఢిల్లీలో ఓ పక్క అల్లర్లు జరుగుతూ అమాయకులైన జనం 30 మంది దాకా మరణించారని, దాని మీద జాతీయ పార్టీ అధ్యక్షుడిగా బాబులో ఉలుకూ పలుకూ లేకపోవడం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. బాబు తీరు చూస్తే ఢిల్లీ అంటేనే భయపడి  నోరు కట్టేసుకున్నట్లుగా  ఉందని దాడి అంటున్నారు.

ఇక విశాఖ పర్యటనకు పోలీసులు అనుమతి ఇచ్చారని అంటున్న బాబు తన టూర్ సాఫీగా జరగాలంటే ప్రజల అనుమతి కూడా అవసరమని గ్రహించకపోవడం  బాధాకరమని అన్నారు. అమరావతి జై అంటూ ఉత్తరాంధ్రాలో తిరుగుతాను అంటే ఇక్కడ జనాలు ఒప్పుకుంటారా అని దాడి ప్రశ్నించారు.

తనకు పోలీసులు మద్దతుగా నిలిచి వేలాది మంది ప్రజలను లాఠీలతో చావగొడితే తప్ప బాబు మనసు శాంతించదా అని నిలదీశారు. ఉత్తరాంధ్రా  ప్రజల మనోభావాలను దెబ్బతీసిన బాబును అందుకే విశాఖలో  అడ్డుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా విశాఖ రాజధానికి అనుకూలమని బాబు చెప్పాలని డిమాండ్  చేసారు.

క్రైమ్ జరగక ముందే ఆపడానికి వచ్చే టీం

అదంతా ప్రమోషనల్ జిమ్మిక్