రోజాలో ఇంత భక్తి దాగుందా? ఏంటి సంగతి?

రెండు రోజులుగా తిరుమలలోనే మకాం వేసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు రోజా. గత నెలలో రోజా ఆలయాల సందర్శన లిస్ట్ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. కాణిపాకం, యాదాద్రి, త్రిపురాంతకం, విజవాడ కనకదుర్గ ఆలయం, కాళహస్తీశ్వర…

రెండు రోజులుగా తిరుమలలోనే మకాం వేసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు రోజా. గత నెలలో రోజా ఆలయాల సందర్శన లిస్ట్ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. కాణిపాకం, యాదాద్రి, త్రిపురాంతకం, విజవాడ కనకదుర్గ ఆలయం, కాళహస్తీశ్వర ఆలయం.. ఇలా ఈ లిస్ట్ లో చిన్నా పెద్దా ఆలయాలన్నీ ఉన్నాయి. మంత్రి పదవి కోసమే రోజా ఇలా ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

మంత్రి వర్గం లిస్ట్ ఖరారైందా..?

ఏపీలో మంత్రి వర్గం పునర్ వ్యవస్థీకరణకు రోజులు దగ్గరపడుతున్నాయి. మరో పది రోజుల్లో ప్రమాణ స్వీకారోత్సవాలు ఉంటాయని చెబుతున్నారు. అయితే పాత వాళ్లలో ఉండేదెవరు, కొత్త లిస్ట్ లో చోటు దక్కించుకునేదెవరు..? ఇది మాత్రం అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ఆ జాబితా ప్రస్తుతానికి ఇంకా సీఎం జగన్ జేబులో మాత్రమే ఉంది.

జిల్లాలు, సామాజిక సమీకరణాలు, గతంలో ఇచ్చిన హామీలు, సీనియార్టీ.. ఇలా అన్ని లెక్కలు వేసుకుని మంత్రి వర్గంలో వారు ఉంటారు, వీరు వెళ్లిపోతారనే ప్రచారం జరుగుతుంది కానీ ఏదీ అధికారికం కాదు. రోజా విషయంలో కూడా అధికారిక ప్రకటన ఏదీ లేదు.

చిత్తూరు ఉమ్మడి జిల్లాకు సంబంధించి పెద్దిరెడ్డి మంత్రి వర్గంలో కొనసాగితే రోజాకు కష్టం. అదే జిల్లా, అదే సామాజిక వర్గం కాబట్టి రోజాకు ఛాన్స్ లేదు. ఒకవేళ రోజాకు తిరుపతి జిల్లా అనే కోటా వర్తిస్తే మాత్రం అవకాశం ఉంటుంది. అక్కడ కూడా తన వర్గం వారికే మంత్రి పదవి ఇవ్వాలని పెద్దిరెడ్డి పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. 

రోజాకి ఛాన్స్ ఇస్తే, తన మాట చెల్లుబాటు కాదని జగన్ వద్ద ప్రస్తావించారట పెద్దిరెడ్డి. అందుకే కన్ఫర్మేషన్ లేక రోజా ఇలా పూజలు, వ్రతాలతో కోటిదేవుళ్లకు మొక్కుతున్నారని అంటున్నారు.

మొత్తమ్మీద మంత్రివర్గ విస్తరణ మహూర్తం దగ్గరపడుతున్న కొద్దీ, రోజూ గోపురాల సందర్శన ఎక్కువైపోతోంది. అందులోనూ తన ఇష్టదైవం వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలోనే ఉంటూ తిరుమలలో ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆ లిస్ట్ ఏదో బయటకు వచ్చే వరకు రోజా ఈ ప్రదక్షిణలు ఆపేలా లేరు.