భార్య మిస్సింగ్ కేసు.. కట్ చేస్తే భర్త హత్యకు కుట్ర

పొద్దున లేచి చూస్తే పక్కన ఉండాల్సిన భార్య లేదు. పిల్లల్ని అడిగితే బయటకు వెళ్లిందన్నారు. ఫోన్ కూడా ఇంట్లో వదిలేసి వెళ్లిపోయింది. అనుమానం వచ్చిన భర్త, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వైఫ్ మిస్సింగ్ అంటూ…

పొద్దున లేచి చూస్తే పక్కన ఉండాల్సిన భార్య లేదు. పిల్లల్ని అడిగితే బయటకు వెళ్లిందన్నారు. ఫోన్ కూడా ఇంట్లో వదిలేసి వెళ్లిపోయింది. అనుమానం వచ్చిన భర్త, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వైఫ్ మిస్సింగ్ అంటూ కేసును విచారిస్తే, భర్త హత్య కుట్ర బయటపడింది. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది

భాస్కర్-హరిత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కొన్నాళ్ల కిందట వీళ్ల ఇంటికి దగ్గర్లో వెంకటేష్ అనే వ్యక్తి అద్దెకు దిగాడు. హరిత-వెంకటేష్ దగ్గరయ్యారు. వెంకటేష్ కోసం భాస్కర్ ను వదిలేసి వెళ్లిపోయింది హరిత. వెంకటేష్ పై ముందు నుంచే అనుమానం ఉన్న భాస్కర్, పోలీసుల్ని ఆశ్రయించాడు.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. వెంకటేష్-హరితను పట్టుకున్నారు. విచారణలో భాగంగా భాస్కర్ ను హత్య చేసేందుకు వెంకటేష్ కుట్ర పన్నిన విషయం బయటపడింది. భాస్కర్ ను అడ్డుతప్పిస్తే తామిద్దరం పెళ్లి చేసుకోవచ్చని, సుఖంగా ఉండొచ్చని వెంకటేష్-హరిత కుట్రపన్నారు.

అనుకున్నదే తడవుగా.. ఓ వ్యక్తికి 5 లక్షల సుపారీ ఇచ్చాడు వెంకటేష్. భాస్కర్ బైక్ కు అతడికి తెలియకుండా జీపీఎస్ ట్రాకర్ ను కూడా అమర్చాడు. ఇక హత్యను అమలు చేయడమే ఆలస్యం అనుకున్న టైమ్ లో హరిత మిస్సింగ్ తో ఈ కుట్ర బయటపడింది. హరిత ప్రోద్బలంతో ఆమె భర్త భాస్కర్ ను చంపేందుకు సుపారీ ఇచ్చిన మాట నిజమేనని వెంకటేష్, పోలీసుల ముందు అంగీకరించాడు.