బీజేపీకి ఆ దమ్ముందా..?

వంటగ్యాస్ సిలిండర్లపై రూ.100 రాయితీ, పెట్రోల్, డీజిల్ రేట్లపై 5 రూపాయల రిబేటు ఇస్తామంటూ తమిళనాడు ఎన్నికల మేనిఫెస్టోలో హామీలిచ్చేశారు డీఎంకే అధినేత స్టాలిన్. పరోక్షంగా బీజేపీని, ఆ పార్టీతో అంటకాగుతున్న అన్నాడీఎంకేని పూర్తిగా…

వంటగ్యాస్ సిలిండర్లపై రూ.100 రాయితీ, పెట్రోల్, డీజిల్ రేట్లపై 5 రూపాయల రిబేటు ఇస్తామంటూ తమిళనాడు ఎన్నికల మేనిఫెస్టోలో హామీలిచ్చేశారు డీఎంకే అధినేత స్టాలిన్. పరోక్షంగా బీజేపీని, ఆ పార్టీతో అంటకాగుతున్న అన్నాడీఎంకేని పూర్తిగా ఇబ్బందుల్లోకి నెట్టేశారు. ఒక్కో దఫా, ఒక్కో ఎన్నికల్లో, కేవలం ఒకే ఒక్క హామీ అధికారానికి దగ్గర చేస్తుందనే విషయం చరిత్ర చెప్పిన నిజం. 

ఈ దఫా తమిళనాడులో స్టాలిన్ కు సహజంగానే సానుకూల పవనాలున్నాయని ప్రీపోల్స్ తేల్చి చెబుతున్నాయి. ఇప్పుడు పెట్రో ఉత్పత్తుల ధరలు సవరిస్తాననే ఎన్నికల హామీతో ఆయనకు వంటింటి ఓట్లన్నీ మూకుమ్మడిగా పడే అవకాశాలున్నాయి.

బీజేపీ కూటమి ధైర్యం చేస్తుందా..?

ఆలస్యంగా మేనిఫెస్టో విడుదల చేసే పార్టీలన్నీ.. ముందుగా వేరే పార్టీలు ఇచ్చిన హామీలను కాపీ కొట్టడం, లేదా అంతకుమించి అంటూ ప్రజల్ని ఊరించడం చూస్తూనే ఉంటాం. అయితే ఇక్కడ బీజేపీ కూటమికి దిక్కుతోచకుండా ఉంది. వాస్తవానికి జయలలితే ఉండి ఉంటే.. గ్యాస్ సిలిండర్ పై నేను 200 రూపాయలు రాయితీ ఇస్తానంటూ ప్రకటించే సాహసం చేసేవారు. కానీ ఇప్పుడామె లేదు, ఉన్నవారు బీజేపీతో కలవడంతో అంత ధైర్యం చేయలేరు.

తమిళనాడులో గ్యాస్ పై రాయితీ ఇస్తే ఎన్నికలు జరగాల్సి ఉన్న మిగిలిన 3 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ప్రజలు ఎందుకు సైలెంట్ గా ఉంటారు. అక్కడ కూడా ఇలాంటి డిమాండ్ లే వినిపిస్తాయి. పోనీ ఓట్లు పడతాయి కదా ఇచ్చేద్దాం అనుకుంటే మాత్రం అది దేశవ్యాప్త ఆందోళనకు దారి తీస్తుంది.

అలా చేస్తే తన గొయ్యి తాను తీసుకున్నట్టే..

సిలిండర్లపై రాయితీని ఎన్నికల హామీగా ప్రకటించారంటే మాత్రం కచ్చితంగా బీజేపీ తన గొయ్యి తాను తీసుకున్నట్టే లెక్క. అంటే దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ ప్రజల్ని తాము మోసం చేసినట్టు బీజేపీ ఒప్పుకున్నట్టే. అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పుడు వచ్చిన సొమ్ముని జేబులో వేసుకున్న కేంద్రం, రేట్లు పెరిగితే మాత్రం ఆ భారాన్ని ప్రజలకు బదిలీ చేసింది.

ప్రస్తుతం ఈ విషయంలో దేశ పౌరులంతా రగిలిపోతున్నారు. ఐదు ప్రాంతాల ప్రజలకు మాత్రం ఎన్నికలతో బీజేపీకి బుద్ధి చెప్పే అవకాశం వచ్చింది. అయితే పోలింగ్ జరిగేలోపు.. దీనిపై కేంద్రం ఓ సంచలన నిర్ణయం తీసుకుంటుందనే పుకారు కూడా షికారు చేస్తోంది. గతంలో 12 సిలిండర్లు రాయితీపై ఇస్తామని చెప్పి, ఆ తర్వాత దానిపై లిమిట్ తీసేసి, అసలు రాయితీయే ఎత్తేసే దశకు చేరుకుంది బీజేపీ.

ఇప్పుడు మళ్లీ అలాంటి లిమిట్ తో బీపీఎల్ ఫ్యామిలీలకు పూర్తిగా సిలిండర్లు ఉచితం అని ప్రకటించబోతుందని అంటున్నారు. దీనిపై అధికారిక సమాచారం విడుదల కావాల్సి ఉంది. అటు తమిళనాడు ఎన్నికలే కాదు, మిగతా ప్రాంతాల ఎన్నికల్లో కూడా ఈసారి పెరిగిన పెట్రో ఉత్పత్తుల రేట్లు కీలకంగా మారే అవకాశం ఉంది. 

ఇదంతా జ‌గ‌న్ శ్ర‌మ ఫ‌లితమే..

నా సినిమాలు ఎక్కువగా ఆడ‌క‌పోవ‌డానికి కార‌ణం..?