చంద్రబాబు రాజకీయ చాణక్యుడు అని ఆయన వందిమాగధులు అంటూంటారు. కానీ ఆయన రాజకీయం గత మూడేళ్ళుగా వేరే రూట్ లో సాగుతోంది. ఇక బాబు ఎత్తుగడలు తమ్ముళ్లను కూడా మెప్పించలేకపోతున్నాయి.
తాజాగా పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని బాబు నిర్ణయించడం పట్ల పార్టీలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది.ఇదిలా ఉంటే బాబు ఒకనాటి సహచరుడు, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అయితే టీడీపీ ఎన్నికల బహిష్కరణ నిర్ణయం మీద సెటైర్లు వెశారు.
చంద్రబాబు అసూయ ఆఖరుకు ఎంతదాకా వచ్చినంటే పార్టీలో తనకూ కుమారుడు లోకేష్ కి మాత్రమే పదవులు ఉండాలి తప్ప మరొకరికి ఉండకూడదు అన్న విధానాన్ని అనుసరిస్తున్నారని దుయ్యబెట్టారు.
జగన్ని వైసీపీని ఎదుర్కోలేకనే చంద్రబాబు ఇలా చేతులెత్తేశారని కూడా విమర్శించారు. ఇవాళో రేపో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలను కూడా చంద్రబాబు బహిష్కరిస్తారేమోనని కూడా దాడి ఎద్దేవా చేశారు.
అసలు ఇవన్నీ ఎందుకు చంద్రబాబు ఏకంగా రాజకీయాలకే సెలవు ప్రకటించి సైలెంట్ అయిపోతే పోలా అంటూ దాడి బాగానే బాణాలు వదిలారు. మొత్తనికి దాడి అన్నట్లుగా తిరుపతి పోరు నుంచి కూడా టీడీపీ బయటకు వస్తుందా అన్నది చూడాల్సిందే మరి.