నగ్నంగా డాన్స్ చేయాలంటూ మహిళపై దాడి

మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన నలుగురు యువకులు, ఓ మహిళపై దాడిచేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ శివార్లలోని రాజేంద్రనగర్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పుట్టినరోజు పార్టీని…

మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన నలుగురు యువకులు, ఓ మహిళపై దాడిచేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ శివార్లలోని రాజేంద్రనగర్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పుట్టినరోజు పార్టీని నిర్వహించేందుకు వచ్చిన మహిళా ఈవెంట్ మేనేజర్ ఈ ఘోర అవమానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.

రాజేంద్రనగర్ కు చెందిన అమీర్ అనే యువకుడు ఈనెల 22న తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ పార్టీని గ్రాండ్ గా జరిపించేందుకు ఓ మహిళా ఈవెంట్ ఆర్గనైజర్ కు కాంట్రాక్ట్ ఇచ్చాడు. పార్టీ అంతా బాగానే ఆర్గనైజ్ చేసిందామె. అయితే తాగిన మత్తులో ఉన్న అమీర్, ఆ మహిళపై కన్నేశాడు. తన స్నేహితులతో కలిసి ఆమె దగ్గరకు వెళ్లాడు.

బట్టలిప్పి తమ ముందు నగ్నంగా డాన్స్ చేయాలంటూ మహిళా ఈవెంట్ మేనేజర్ ను డిమాండ్ చేశారు అమీర్ స్నేహితులు. అంతా తాగి ఉన్నారు. నిరాకరించిన మహిళా ఆర్గనైజర్ ను బెదిరించారు. ఆ తర్వాత నిర్భందించారు. రాత్రంతా అక్కడే బిక్కుబిక్కుమంటూ గడిపిన సదరు మహిళ, ఎలాగోలా ఆ ప్రాంతం నుంచి తప్పించుకుంది.

మరుసటి రోజు ఉదయాన్నే తన భర్త సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదుచేసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు, పరారీలో ఉన్న అమీర్ తో పాటు అతడి స్నేహితుల కోసం వెదుకుకున్నారు. మద్యం మత్తులో యువకులు ఎలా విచక్షణ కోల్పోయి పైశాచికంగా ప్రవర్తిస్తున్నారో చెప్పడానికి ఇదొక ఉదాహరణ.

నాలుగేళ్ల తర్వాత హిట్‌ వచ్చింది