సెల్ఫ్ క్వారంటైన్ లో లేకుండా బాయ్ ఫ్రెండ్ తో..

కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే స్వీయ నిర్బంధం చాలా అవసరం. ఎవరికి వారు ఈ విషయంలో క్రమశిక్షణతో వ్యవహరించినప్పుడు మాత్రమే వైరస్ వ్యాప్తిని నిరోధించగలం. దేశమంతా జాగ్రత్తలు తీసుకుంటుంటే.. విదేశం నుంచి వచ్చిన ఓ…

కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే స్వీయ నిర్బంధం చాలా అవసరం. ఎవరికి వారు ఈ విషయంలో క్రమశిక్షణతో వ్యవహరించినప్పుడు మాత్రమే వైరస్ వ్యాప్తిని నిరోధించగలం. దేశమంతా జాగ్రత్తలు తీసుకుంటుంటే.. విదేశం నుంచి వచ్చిన ఓ మహిళ మాత్రం స్వీయ నిర్భంధాన్ని పక్కనపెట్టి బాయ్ ఫ్రెండ్ తో జల్సా చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.

ఈమధ్యే సింగపూర్ నుంచి హైదరాబాద్ వచ్చింది ఓ యువతి. ఎయిర్ పోర్ట్ లోనే ఆమెకు స్క్రీనింగ్ చేశారు. 14 రోజుల పాటు సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాల్సిందిగా చెప్పారు. లెక్కప్రకారం ఆమె హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్లాలి. కానీ అలా చేయలేదు. హైదరాబాద్ లోని ఓల్డ్ బోయిన్ పల్లి రాజారెడ్డి కాలనీలో ఓ అపార్ట్ మెంట్ తీసుకొని అక్కడే ఉంది.

ఆ అపార్ట్ మెంట్ లో కూడా ఆమె స్వీయ నిర్బంధంలో లేదు. తన బాయ్ ఫ్రెండ్ ను పిలిపించుకొని పార్టీ చేసుకుంది. దీంతో అపార్ట్ మెంట్ లో నివశిస్తున్న ఇతరులకు అనుమానం వచ్చింది. మరుసటి రోజు ఉదయాన్నే ఆమెను పిలిచి ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆమె చేతిపై ఉన్న సెల్ఫ్ క్వారంటైన్ ముద్రను చూశారు. వెంటనే ఆమెను గదిలో బంధించి పోలీసులకు సమాచారం అందించారు.

సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండకుండా బయటకొస్తున్న కారణంగా సదరు యువతిని పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆమె బాయ్ ఫ్రెండ్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇద్దర్నీ రాజేంద్రనగర్ లో ఉన్న ప్రభుత్వ క్వారంటైన్ వార్డులకు తరలించారు. హైదరాబాద్ లో ఆమె ఇంకా ఎవరెవర్ని కలిసిందనే అంశంపై ఆరా తీస్తున్న పోలీసులు.. పనిలోపనిగా ఆమెపై కేసు నమోదుచేసే ప్రయత్నంలో ఉన్నారు.

బైట తిరిగితే సీరియస్ యాక్షన్

400 ఏళ్ల భాగ్యనగరి చరిత్రలో తొలిసారి ఇలా