చాలా ఏళ్లుగా కాపురం చేస్తోంది. ఎదిగిన కొడుకు కూడా ఉన్నాడు. అయినప్పటికీ ఆమెకు అక్రమ సంబంధం కావాల్సి వచ్చింది. దాని కోసం కట్టుకున్న భర్తనే చంపేసింది. తిరుపతిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకం రేపింది
చంద్రగిరి మండలం అరిగెలవారిపల్లెకు చెందిన వాసు, చిత్తూరు కలెక్టర్ ఆఫీస్ లో అటెండర్ గా పనిచేస్తున్నాడు. ఈయనకు భార్య స్వప్నప్రియ, కొడుకు ఉన్నారు. అయితే కొన్నాళ్లుగా స్వప్నప్రియ వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో భర్తను అడ్డు తప్పించేందుకు ప్రయత్నించింది. పైగా భర్త మరణిస్తే, తనకు చాలా డబ్బు వస్తుందని ఆశపడింది కూడా.
పక్కాగా ప్లాన్ వేసిన స్వప్నప్రియ, భర్త మెడ విరిచి హత్య చేసింది. గుండెపోటుతో మరణించినట్టు నాటకం ఆడింది. అయితే కొడుక్కి మాత్రం అనుమానం వచ్చింది. తండ్రి మెడపై గాయాలు గుర్తించిన అతడు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రంగంలోకి దిగిన పోలీసులు వాసు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. స్వప్నప్రియను అదుపులోకి తీసుకున్నారు. ఆమె గురించి చుట్టుపక్కల ఎంక్వయిరీ చేశారు. స్వప్నప్రియకు వివాహేతర సంబంధం ఉందని ఇరుగుపొరుగు వాళ్లు నిర్థారించారు.