కరోనా వ్యాక్సిన్ వేయించుకునేలా ప్రజల్ని ప్రోత్సహించేందుకు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు ఎన్నో ఆఫర్లు, ప్రోత్సాహకాలు ప్రకటించాయి. కొన్ని దేశాలు నిర్బంధంగా టీకాలు వేస్తుంటే, మరికొన్ని దేశాల్లో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి టీకా వేయించుకునేలా ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి.
ఇందులో భాగంగా కొన్ని ప్రభుత్వాలు తమ ప్రజలకు గొర్రె పిల్లల్ని బహుమతులుగా ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆస్ట్రేలియాలో మాత్రం ప్రజల్ని టీకా తీసుకునేలా ప్రోత్సహించేందుకు అతి పెద్ద లాటరీలో పాల్గొనే అవకాశం కల్పించారు.
కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే, మిలియన్ డాలర్ లాటరీలో పాల్గొనే అవకాశాన్ని కల్పించింది. అలా 30 లక్షల మంది, వ్యాక్సిన్ వేయించుకొని ఈ లాటరీకి అర్హత పొందగా.. జొనీ జూ హూ అనే 25 ఏళ్ల అమ్మాయి మిలియన్ డాలర్ లాటరీని దక్కించుకుంది. భారతీయ కరెన్సీలో దీని విలువ 7 కోట్ల రూపాయల పైమాటే.
ఈ లాటరీకి అర్హత పొందిన విషయాన్ని కూడా మరిచిపోయింది జూ హు. గెలిచిన విషయం కూడా ఆమెకు తెలియదు. ఓసారి తను ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నప్పుడు లాటరీ నిర్వహకుల నుంచి ఫోన్ వస్తే కట్ చేసింది కూడా. ఆ తర్వాత నిర్వహకులు ఏకంగా చెక్ తో ప్రత్యక్షమై, జూహు కు షాక్ ఇచ్చారు.
ఊహించని విధంగా కోటీశ్వరురాలు అయిపోవడంతో జూహూ ఆనందానికి అంతులేద. తనకొచ్చిన డబ్బుతో ముందుగా తన తల్లిదండ్రులు, బంధువుల్ని చైనా నూతన సంవత్సర వేడుకలకు తీసుకెళ్తానని.. మిగిలిన డబ్బును భవిష్యత్ అవసరాల కోసం పెట్టుబడిగా పెడతానని తెలిపింది జుహు. మొత్తానికి ఒక కరోనా టీకా, ఈ అమ్మాయి జీవితాన్నే మార్చేసింది.