‘యూ టూ యామినీ..’ ఇక మిగిలేదెవరు!

చంద్రబాబుకు అతి సన్నిహితులు అయిన సుజనా చౌదరి, సీఎం రమేశ్ లే పార్టీ అధికారం కోల్పోయిన పక్షం  రోజులు కూడా ఆయనతో ఉండలేదు! అయితే వారిని చంద్రబాబు నాయుడే బీజేపీలోకి పంపించారనే టాక్ ఉందనుకోండి.…

చంద్రబాబుకు అతి సన్నిహితులు అయిన సుజనా చౌదరి, సీఎం రమేశ్ లే పార్టీ అధికారం కోల్పోయిన పక్షం  రోజులు కూడా ఆయనతో ఉండలేదు! అయితే వారిని చంద్రబాబు నాయుడే బీజేపీలోకి పంపించారనే టాక్ ఉందనుకోండి. తెలుగుదేశంలో వాళ్లు ఉండీ చేసేదేం లేదని, ఢిల్లీలో బీజేపీలో  ఉంటూ తన అనుకూల లాబీయింగ్ కోసం చంద్రబాబు నాయుడు వారిని పంపించారనే అభిప్రాయాలు  గట్టిగా వినిపించాయి!

వారే అనుకుంటే.. చినబాబు లోకేష్ భక్త సమాజం సభ్యురాలైన యామినీ శర్మ కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో యామినీ శర్మ వెలుగుల గురించి వేరే చెప్పనక్కర్లేదు. అనునిత్యం టీవీ చానళ్లలో కూర్చుని అడ్డగోలుగా చంద్రబాబును, లోకేష్ ను సమర్థించిన నేపథ్యం ఉందీమెకు. అలాంటి భక్తురాలు ఇప్పుడు  తెలుగుదేశం పార్టీని వీడుతోందంటే.. లోకేష్ అభిమాన సంఘాలు భరించలేకపోతూ ఉన్నాయట!

యామినీలాంటి వాళ్లే పార్టీని వీడితే ఇక పార్టీ గతేంటని వారు చర్చించుకుంటున్నారట. కొన్నాళ్లుగా యామినీ శర్మ రాజకీయంగా యాక్టివ్ గా లేరు. అయితే సోషల్ మీడియాతో ఈమె పేరుతో కొన్ని అకౌంట్లు పని చేస్తూ వాటి ద్వారా సీఎం వైఎస్ జగన్ మీద అనుచిత పోస్టులు పెట్టారు. వాటితో తనకు సంబంధం లేదని యామిని ప్రకటించుకుంది. సోషల్ మీడియాలో ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ స్థాయిలో ఉంది. 

యామిని టీడీపీని వీడుతుందని కొన్నాళ్ల కిందటే వార్తలు వచ్చాయి. అప్పుడు ఆమె వాటిని ఖండించారు. ఇప్పుడు టీడీపీకి రాజీనామా అని ప్రకటించారట. 'యూ టూ యామినీ..'అని వాపోతున్నాయి లోకేష్ అభిమాన సంఘాలు.